Shubman Gill Catch
స్పోర్ట్స్

Shubman Gill Catch : గిల్.. అద్భుతమైన క్యాచ్

Shubman Gill Catch :  ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఆఖరిటెస్టు మ్యాచ్ ధర్మశాలలో ప్రారంభమైంది. అయితే ఇక్కడ ఒక అద్భుతం జరిగింది. మొదట ఇంగ్లాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది.

ఇంగ్లాండ్ ఓపెనర్లు జాక్ క్రాలీ, బెన్ డకెట్ ఇద్దరూ భారత్ పేసర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. 17వ ఓవర్ వరకు వికెట్ పడలేదు. 18వ ఓవర్ లో కుల్దీప్ ఆఖరి బంతిని గూగ్లీ వేశాడు. దాంతో టెంప్ట్ అయిన బెన్ డకెట్ ముందుకొచ్చి భారీ షాట్ కొట్టాడు. అయితే అది కరెక్ట్ గా కనెక్ట్ అవలేదు. సరికదా ఎక్స్ ట్రా కవర్ మీదుగా గాల్లోకి లేచింది.

అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న గిల్… గాల్లోనే బంతిని చూస్తూ రివర్స్ లో పరుగెత్తాడు. అప్పటికి తనకంటే ముందు బాల్ ల్యాండ్ అవడం చూసి ఒక్కసారి బాల్ మీదకు డైవ్ చేశాడు. నీటిలో చేప పిల్లను పట్టినట్టు ఒడిసి పట్టేసి గాల్లోనే పల్టీలు కొడుతూ కింద పడ్డాడు. అంతే అందరూ గిల్ ని అభినందనలతో ముంచెత్తారు.

అలా వచ్చిన బ్రేక్.. కొనసాగుతూ పోయింది. ఇప్పుడు గిల్ పట్టిన క్యాచ్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ క్యాచ్ ను చూసిన రవిశాస్త్రి అభినందిస్తూ చెప్పిన మాటలు కూడా వైరల్ గా మారాయి. ఇంతకీ తనేమన్నాడంటే .. నాకు తెలిసి గిల్.. ఒక 20 నుంచి 25 అడుగులు దూరం పరిగెట్టి ఉంటాడని అన్నాడు.

నెట్టింట అయితే సూపర్ మ్యాన్ అంటూ ట్యాగ్స్ పెడుతున్నారు. మొత్తానికి ఇంగ్లాండ్ పతనానికి గిల్ అలా నాంది పలికాడని అందరూ కోట్ చేస్తున్నారు. తను అలా ట్రై చేసి ఉండకపోతే మ్యాచ్ ఇండియా చేతుల్లోకి వచ్చేది కాదని అంటున్నారు. ఆ వికెట్ తర్వాత కులదీప్ బౌలింగ్ కి ఇంగ్లాండ్ విలవిల్లాడింది. ప్రస్తుతం తన 5 వికెట్లు తీసి ఇంగ్లాండ్ పతనాన్ని శాసించాడు.

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ