Sehwag Who Shakib Al Hasan Blunt Response Indian Great Criticism
స్పోర్ట్స్

Viral Comments: సెహ్వాగ్‌ ఎవరో నాకు తెలియదన్న ప్లేయర్

Sehwag Who Shakib Al Hasan Blunt Response Indian Great Criticism: విధ్వంసకర మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ గురించి క్రికెట్ ప్రపంచంలో ఎవ్వరైనా సరే గుర్తుపడుతారు. ఎందుకంటే ప్రత్యర్థి ఎవరైనా, పిచ్ ఏదైనా సరే ఆది నుంచే బౌలర్లపై విరుచుకుపడుతూ పరుగుల వరద కురిపిస్తుంటాడు. అందుకే భారత్‌తో పాటు వరల్డ్‌వైడ్‌గా సెహ్వాగ్‌కు ఫ్యాన్స్ ఫాలోయింగ్‌ చాలా ఉంది. అయితే ఈ మధ్యే వీరేంద్ర సెహ్వాగ్ గురించి బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకిబ్ అల్ హసన్‌ను ఓ జర్నలిస్ట్ క్వశ్ఛన్ చేశాడు. దానికి షకిబ్, సెహ్వాగ్‌ అంటే నాకు తెలియదని, సెహ్వాగ్‌ ఎవరో కూడా నాకు తెలియదని ఆన్సర్ ఇవ్వడంతో అక్కడున్నవారంతా ఖంగు తిన్నారు.

అంతేకాదు అన్ని విమర్శలకు ఏ ఆటగాడు రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేదు. జట్టుకు సపోర్ట్ చేయడమే ఆటగాళ్ల బాధ్యత. ఓ బ్యాటర్ రన్స్‌ సాధించాలి. ఓ బౌలర్ మెరుగ్గా బౌలింగ్ చేయాలి. అయితే జట్టుకు అండగా నిలవకలేపోయిన సందర్భంలో ఆటగాళ్లపై చర్చ సాగుతుంటుంది. ఇది అంత చెడ్డ విషయమేమి కాదని షకిబ్ రిప్లై ఇచ్చాడు. దీని వెనుక కూడా పెద్ధ స్టోరీనే ఉంది. ఇంతకీ ఏం జరిగిందంటే నెదర్లాండ్స్‌పై విజయంలో షకిబ్ కీ రోల్ పోషించాడు. 46 బంతుల్లో అజేయంగా 64 రన్స్ చేశాడు. షకిబ్ అర్ధశతకంతో బంగ్లాదేశ్ 20 ఓవర్లలో అయిదు వికెట్లకు 159 రన్స్‌ చేసింది. అనంతరం ఛేదనలో నెదర్లాండ్స్ ఎనిమిది వికెట్లు కోల్పోయి 134 పరుగులే ఆలౌట్ అయింది.

Also Read: టీమిండియాలో మెరిసిన అమ్మాయి, ఫొటో వైరల్‌

అయితే దక్షిణాఫ్రికా‌తో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ నాలుగు రన్స్ తేడాతో ఓటమిపాలవడంతో ఆ ఛేదనలో షకిబ్ విఫలమయ్యాడు. నోకియా బౌలింగ్‌లో పుల్ షాట్‌కు యత్నించి వెనుదిరిగాడు. నాలుగు బంతుల్లో మూడు పరుగులే చేశాడు. దీనిపై వీరేంద్ర సెహ్వాగ్ మాట్లాడుతూ షకిబ్‌ను విమర్శించాడు. కాసేపు క్రీజులో ఉండటానికి ప్రయత్నించాల్సిందని అన్నాడు. హెడెన్, గిల్‌క్రిస్ట్‌లా షార్ట్ బాల్స్‌లో పుల్ షాట్ ఆడాలనుకోవడం పొరపాటు అని, తన ప్రమాణాలకు తగ్గట్లుగా స్ట్రోక్స్ ప్లేతో ఆడాల్సిందని, అనుభవజ్ఞుడు షకిబ్ నుంచి ఇలాంటి ప్రదర్శన కోరుకోలేదని సెహ్వాగ్ తెలిపాడు.

Just In

01

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!

Pak Targets Salman: సల్మాన్ ఖాన్‌పై పగబట్టిన పాకిస్థాన్.. ఉగ్రవాదిగా ముద్ర వేసేందుకు భారీ కుట్ర!

Hindu Rituals: దేవుడి దగ్గర కొబ్బరికాయను ఇలా కొడితే.. లక్ష్మీదేవి అనుగ్రహం పక్కా?