Sanju Samson rajasthan
స్పోర్ట్స్

Sanju Samson: సంజూ బ్యాడ్ లక్

Sanju Samson fined 30 percent fees due to clash with ampire ipl 2024:
ఐపీఎల్ 2024 మ్యాచ్ లు రసవత్తరంగా జరగుతున్నాయి. నువ్వా నేనా అన్నట్లుగా క్రీడాభిమానులను ఉర్రూతలూగిస్తున్నాయి. అయితే మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఊహించని రీతిలో ఢిల్లీ గెలిచింది. ఈ మ్యాచులో రాజస్థాన్ కెప్టెన్ సంజు అవుట్ అయిన తీరు వివాదాస్పదంగా మారింది. ఈ క్రమంలో అతను అంపైర్ తో వాగ్వాదానికి దిగాడు. దీంతో బీసీసీఐ రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ ఐపీఎల్ క్రికెట్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు 30 శాతం మ్యాచ్ ఫీజు జరిమానా విధించింది. కాగా ఇది అతనికి ఇది రెండో పెద్ద జరిమానా కావడం విశేషం. ఏప్రిల్ 10న జైపూర్‌లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్‌రేట్‌ను కొనసాగించినందుకు రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌కి రూ. 12 లక్షల జరిమానా విధించించిన సంగతి తెలిసిందే.

అసలేం జరిగిందంటే..

అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచులో రాజస్థాన్ రాయల్స్ 222 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగింది. తమ జట్టు వరుస వికెట్లు కోల్పోతున్నప్పటికి సంజూ దీటుగా ఆడుతున్నాడు. గెలుపు లక్ష్యంగా ఆత్మవిశ్వాసంతో 86 పరుగులతో ఆడుతున్నాడు. ఈ క్రమంలో ముఖేశ్ కుమార్ వేసిన 16 వ ఓవర్ లో నాలుగో బంతిని శాంసన్ సిక్సర్ కొట్టేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో బౌండరీ లైన్ వద్ద ఉన్న షై హోప్ సరిగ్గా బౌండరీ లైన్ కు అంగుళాల దూరంలో క్యాచ్ పట్టాడు. ఆ సమయంలో అతను కాస్తా అదుపుతప్పి బౌండరి లైన్ వైపు అడుగులు వేశాడు. దీంతో అంతా సంజూ నాటౌట్ అనుకున్నారు. కానీ థర్డ్ అంపైర్.. క్షుణ్ణంగా పరీక్షించి అవుట్ గా ప్రకటించాడు. అయినప్పటికి సంజూ మరోసారి థర్డ్ అంపైర్ కు రివ్యూ కోరుతూ.. ఫీల్డ్ అంపైర్లతో వాగ్వాదం చేశాడు. దీంతో ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు.. అతని ఫీజులో 30 కోత విధించారు. అలాగే మరోసారి ఇలా జరిగితే ఒక మ్యాచ్ నిషేధం కూడా విధించే అవకాశం ఉందని హెచ్చరించినట్లు తెలిసింది.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!