Right Decision At Right Time
స్పోర్ట్స్

SRH: కరెక్ట్‌ టైమ్‌లో కరెక్ట్‌ డెసీషన్‌

Right Decision At Right Time: ఐపీఎల్ 2024 లీగ్‌లలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ టీమ్‌కి అదృష్టం బాగా కలిసి వస్తోంది. సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో వరుసగా రెండోసారి చాంపియన్‌గా నిలిచిన సన్‌రైజర్స్‌, క్యాష్‌ రిచ్‌ లీగ్‌ ఐపీఎల్‌లోనూ దుమ్ములేపుతోంది.గత మూడేళ్ల వైఫల్యాలను మరిపించేలా సంచలన ప్రదర్శనతో ఊహించని షాక్ ఇచ్చి ఫైనల్‌కు చేరుకుంది. ప్యాట్‌ కమిన్స్‌ సారథ్యంలో విధ్వంసకర బ్యాటింగ్‌తో సరికొత్త రికార్డులు సృష్టిస్తూ ఆరేళ్ల తర్వాత టైటిల్‌ రేసులో నిలిచింది.క్వాలిఫయర్‌2లో రాజస్తాన్‌ రాయల్స్‌ను 36 రన్స్‌తో ఓడించి కేకేఆర్‌ను ఢీకొట్టేందుకు రెడీ అయింది.

కేకేఆర్‌ రూపంలో ఇంకొక్క గండం దాటేస్తే ట్రోఫీని ముద్దాడే ఛాన్స్ తమ ముంగిట నిలిచింది. ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్‌ యజమాని కావ్యా మారన్‌ ఫుల్‌ జోష్‌లో ఉంది. తన ఆనందానికి అవధులు లేకుండా అయిపోయాయి. కీలక మ్యాచ్‌లో ఆద్యంతం తన హావభావాలతో ఈ మ్యాచ్‌కి హైలైట్‌గా నిలిచింది. మెయిన్‌గా రాజస్తాన్‌ కెప్టెన్‌, స్టార్‌ బ్యాటర్‌ సంజూ శాంసన్‌ను అభిషేక్‌ శర్మ అవుట్‌ చేయగానే జట్టు గెలిచినంతగా సెలబ్రేట్‌ చేసుకున్నారు. ఇక రాజస్తాన్‌పై తమ విజయం ఖరారు కాగానే ఆమె ఎగిరి గంతేశారు. తన తండ్రి కళానిధి మారన్‌ను ఆలింగనం చేసుకుని ఆనందాన్ని షేర్ చేసుకున్నారు. వేలంలో తాను అనుసరించిన ప్లానింగ్‌ రిజల్ట్స్ తీరుకు మురిసిపోతూ చిరునవ్వులు చిందించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి.

Also Read: అతి చేయవద్దని సూచించిన భారత మాజీ ఆటగాడు

కాగా ఐపీఎల్‌ 2024 ఆరంభానికి ముందు సన్‌రైజర్స్‌ యాజమాన్యం కీలక మార్పులు చేసింది. బ్రియన్‌ లారా స్థానంలో న్యూజిలాండ్‌ స్పిన్‌ దిగ్గజం డానియల్‌ వెటోరిని ప్రధాన కోచ్‌గా నియమించింది.అదే విధంగా వన్డే ప్రపంచకప్‌ 2023 విజేత, ఆస్ట్రేలియా కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ కోసం ఏకంగా రూ. 20.50 కోట్లు ఖర్చు పెట్టింది. అతడికి సారథ్య బాధ్యతలు అప్పగించి పూర్తి నమ్మకం ఉంచింది. అందుకు తగ్గట్లుగానే ఈ ఆసీస్‌ పేసర్‌ జట్టును విజయపథంలో నిలిపాడు. వేలం నాటి నుంచే సన్‌రైజర్స్‌ మేనేజ్‌మెంట్‌ వ్యూహాలను, కావ్య మారన్‌ నిర్ణయాలను విమర్శించిన వాళ్లకు అద్భుత ప్రదర్శనతో జట్టును ఫైనల్‌కు చేర్చాడు. 2023లో మొదలైన సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో సన్‌రైజర్స్‌ ఈస్టర్న్‌కేప్‌ పేరిట ఎంట్రీ ఇచ్చింది సన్‌గ్రూప్‌. ఐడెన్‌ మార్క్రమ్‌ను కెప్టెన్‌గా నియమించగా, అరంగేట్రంలోనే జట్టును టైటిల్‌ విజేతగా నిలిపాడు.ఈ ఏడాది ఫిబ్రవరిలో ముగిసిన ఫైనల్లోనూ సన్‌రైజర్స్‌ను గెలిపించి ట్రోఫీ అందించాడు.

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు