Ridhima Pandit Reacts Wedding Rumours Shubman Gill
స్పోర్ట్స్

Viral News: క్రికెటర్‌తో పెళ్లి రూమర్స్‌కి నటి చెక్‌

Ridhima Pandit Reacts Wedding Rumours Shubman Gill: బాలీవుడ్ బుల్లితెర నటి రిద్ధిమా పండిత్, టీమిండియా యువ ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ ప్రేమలో ఉన్నారని సోషల్‌ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. అంతేకాకుండా 2024 డిసెంబర్‌లో ఏడడుగులు వేయబోతున్నారంటూ ఓ వార్త నెట్టింట చెక్కర్లు కొడుతోంది. దీంతో ఫ్యాన్స్ ఇది నిజమేనని భావించి నటికి కంగ్రాట్స్‌ చెప్తున్నారు. తనకే తెలియకుండా తన పెళ్లి వార్తలు రావడంతో నటి రియాక్ట్‌ అవ్వక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో ఓ వీడియో షేర్‌ చేసి రూమర్స్‌కు చెక్‌ పెట్టింది.

అందులో రిద్ధిమా మాట్లాడుతూ..ఈరోజు ఉదయాన్నే చాలామంది జర్నలిస్టులు నాకు ఫోన్‌ చేసి పెళ్లి గురించి అడిగారు. వారి ఫోన్‌తోనే నిద్ర లేచాను. నాకే తెలియకుండా పెళ్లి చేసుకుంటున్నానా? నిజంగా అలాంటి గుడ్‌న్యూస్‌ ఏదైనా ఉంటే నేనే సంతోషంగా సోషల్‌ మీడియాలో ప్రకటిస్తాను కదా.. కాబట్టి మీరు అనుకుంటుందేదీ నిజం కాదు. అసలు శుబ్‌మన్‌ గిల్‌తో వ్యక్తిగత పరిచయమే లేదు. అదంతా ఫేక్‌’ అని పేర్కొంది. ఇప్పట్లో వివాహం చేసుకునే ఉద్దేశం కూడా లేదంది.కాగా రిద్ధిమా పండిత్‌.. బాహు మహారి రజనీకాంత్ సీరియల్‌లో ముఖ్య పాత్రలో నటించింది. అలాగే ఖాత్ర ఖాత్ర ఖాత్ర అనే షోలోనూ మెరిసింది. హిందీ బిగ్‌బాస్‌ ఫస్ట్‌ ఓటీటీ సీజన్‌లోనూ పాల్గొంది. కాగా ఇటీవల రిద్దిమా ఓ ఇంటర్వ్యూలో టీవీ ఇండస్ట్రీలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని వెల్లడించింది.

Also Read: ఫైనల్ జట్టు ఇదే! దిగ్గజ క్రికెటర్‌ రివీల్‌

ఇండస్ట్రీలో ఉండే వేధింపుల గురించి ఎవరూ మాట్లాడరు. నేను పని చేసిన ఓ షోలో ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత నన్ను మానసికంగా వేధించాడు. మా అమ్మకు ఆరోగ్యం బాలేక ఆస్పత్రిపాలైంది. ఐసీయూలో అడ్మిట్‌ కావడంతో నేను తట్టుకోలేకపోయాను.ఉదయం ఏడు నుంచి ఎనిమిది గంట మధ్య, సాయంత్రం నాలుగింటి నుంచి ఐదున్నర గంటల మధ్య మాత్రమే చూసేందుకు అనుమతిచ్చేవారు. అమ్మకు బాగోలేదు.. నేను తొమ్మిదింటికి షూట్‌కు వస్తాను అని అడిగాను. పోనీ ఉదయం 7 గంటకు వచ్చినా సాయంత్రం నాలుగుకల్లా వెళ్లిపోతానన్నాను. కావాలంటే తర్వాత ఎక్కువ గంటలు ఉంటానన్నాను. అయినా తను పట్టించుకోలేదు. నా మాట లెక్కచేయలేదు, తను చెప్పిన సమయానికే రావాలనేవాడు. ఎక్కడ ప్రాజెక్ట్‌లో నుంచి తీసేస్తారోనన్న భయంతో ఎవరూ ఇలాంటివి బయటకు చెప్పరు’ అని రిద్ధిమా చెప్పుకొచ్చింది.

Just In

01

CM Revanth Reddy: దేశంలోనే భాద్‌షా.. జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు