Rashid Khan Big Tribute To Wi Great For Their Victory
స్పోర్ట్స్

T20 WorldCup Match: ఆ విజయం ఆయనకే అంకితం

Rashid Khan Big Tribute To Wi Great For Their Victory: ప్రపంచకప్‌లో అఫ్గానిస్థాన్ తొలిసారి సెమీస్‌కు చేరి సరికొత్త హిస్టరీని సృష్టించింది. సూపర్‌-8 పోరులో ఆస్ట్రేలియాను ఓడించి కీలకమైన మ్యాచ్‌లో బంగ్లాను చిత్తు చేసి మరీ అఫ్గాన్‌ సెమీస్ బెర్త్‌ను పక్కా చేసుకుంది. తమ విజయం వెనక చాలామంది కృషి ఉందని ఈ ఘనతను విండీస్‌ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారాకు అంకితం చేస్తున్నట్లు అఫ్గాన్‌ కెప్టెన్ రషీద్ ఖాన్‌ వ్యాఖ్యానించాడు.

మేం సెమీ ఫైనల్స్‌కు చేరగలమని నమ్మకం ఉంచిన ఒకే ఒక్కరు బ్రియాన్‌ లారా. మెగా టోర్నీకి ముందు ఓసారి అతడిని కలిసినప్పుడు మీ మాటలను వమ్ము చేయమని అప్పుడే చెప్పాం. వరల్డ్‌ కప్‌ వంటి మెగా సంగ్రామంలో సెమీస్‌కు చేరడం మా కల. ఇప్పటికి అది నెరవేరింది. న్యూజిలాండ్‌ను ఓడించడంతో మాపై మరింత నమ్మకం కలిగింది. మా జట్టు పట్ల గర్వంగా ఉన్నా. ఈ పిచ్‌ మీద 130 రన్స్ మంచి స్కోరు అని భావించా. కానీ బ్యాటింగ్‌లో 20 రన్స్ వెనకబడ్డాం. అయితే, 115 రన్స్‌ లక్ష్యాన్ని 12 ఓవర్లలో ఛేదించేందుకు వారు దూకుడుగా ఆడతారని తెలుసు.

Also Read: యంగ్‌ ప్లేయర్‌కి బీసీసీఐ బంపరాఫర్‌

అదే మాకు అడ్వాంటేజ్‌గా మారింది. స్టంప్స్‌ను లక్ష్యంగా చేసుకుని బౌలింగ్‌ చేస్తే సత్ఫలితం ఉంటుందని ప్లాన్‌ రెడీ చేసుకుని బరిలోకి దిగి కరెక్ట్‌గా ప్లాన్ చేశాం. వర్షం మన చేతుల్లో ఉండదు. వందశాతం విజయం కోసం శ్రమించి సక్సెస్ అయ్యామని రషీద్ తెలిపాడు. అంతర్జాతీయ టీ20ల్లో 4 వికెట్ల ప్రదర్శనను రషీద్ 9 సార్లు సాధించి షకిబ్‌ను అధిగమించాడు. సెమీస్‌కు చేరడం చాలా ఆనందంగా ఉంది. గత కొన్నేళ్లుగా మేం చేస్తున్న కష్టానికి ప్రతిఫలం దక్కింది. లైన్‌ అండ్‌ లెంగ్త్‌తోపాటు వైవిధ్యంగా బంతులేస్తేనే వికెట్లు తీయడం ఈజీ అవుతుందని నవీనుల్‌ హక్ తెలిపాడు. కీలక టైమ్‌లో నాలుగు వికెట్లు తీసిన అతడికే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది.

Just In

01

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు

Proddatur Dasara: దాగి ఉన్న చరిత్రను చెప్పే కథే ఈ ‘ప్రొద్దుటూరు దసరా’.. ఆ రోజు మాత్రం!

Gadwal: గద్వాల నడిబొడ్డున ఎండోమెంట్ ఖాళీ స్థలం కబ్జా.. దర్జాగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం