rajat patidar
స్పోర్ట్స్

Rcb | ఆర్సీబీ కొత్త కెప్టెన్ గా రజత్ పటీదార్..!

Rcb | ఐపీఎల్ దిగ్గజ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుకు కొత్త కెప్టెన్ వచ్చేశాడు. రజత్ పటీదార్ ను కొత్త కెప్టెన్ గా ప్రకటించింది మేనేజ్ మెంట్. విరాట్ కోహ్లీ సుదీర్ఘంగా కెప్టెన్ గా పనిచేశాడు. కానీ కప్ కొట్టలేకపోవడంతో ఆయన బాధ్యత వహిస్తూ కెప్టెన్ నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత కెప్టెన్ గా ఆస్ట్రేలియా ప్లేయర్ డూ ప్లెసిస్ వ్యవహరించాడు. కానీ అతన్ని కెప్టెన్ గా కొనసాగించడానికి బెంగుళూరు జట్టు (Rcb) అంగీకరించలేదు. మొన్నటి మెగా వేళంలో అతన్ని కొనుగోలు చేయలేదు. దాంతో మళ్లీ విరాట్ కోహ్లీకే పగ్గాలు ఇస్తారని అంతా అనుకున్నారు. కానీ కెప్టెన్ గా చేయడానికి విరాట్ సిద్ధంగా లేడు.

అందుకే రజత్ ను ఎంపిక చేశారు. విరాట్ ఆధ్వర్యంలోనే రజత్ నడిపిస్తాడని తెలుస్తోంది. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఆర్సీబీ కప్ కొట్టలేదు. మూడు సార్లు ఫైనల్ దాకా వచ్చిన ఆ జట్టు.. చివర్లో చేతులెత్తేస్తోంది. ప్రతిసారి అద్భుతంగా రాణించినా.. లీగ్ అయిపోయిన తర్వాత చేతులెత్తేయడంతో కప్ కొట్టలేకపోతోంది.

కానీ ఆ టీమ్ అగ్ర జట్టులతో సమానంగా ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. ఈ సాలా కప్ నమ్ దే అంటూ ప్రతిసారి దూకుడుగానే ఆడుతోంది. విరాట్ కోహ్లీ లాంటి స్టార్ క్రికెటర్ల మెరుపులు చూసేందుకు బెంగుళూరు బ్యాటింగ్ కే ఎక్కువ అభిమానులు ఉండటం విశేషం. ఇప్పుడు కొత్త కెప్టెన్ హయాంలో అయినా కప్ కొట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Just In

01

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు