PV Sindhu | సేమ్‌ టు సేమ్‌, సింధు ఓటమి
PV Sindhu Loses To Carolin Marin Yet Again
స్పోర్ట్స్

PV Sindhu: సేమ్‌ టు సేమ్‌, సింధు ఓటమి

PV Sindhu Loses To Carolin Marin Yet Again: సింగపూర్‌ ఓపెన్‌లో ఫ్రీక్వార్టర్స్‌లోనే ఓటమి పాలైన భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధుకు మరో పరాభవం ఎదురైంది. ఇండోనేషియా ఓపెన్‌లో తొలి రౌండ్‌లో సింధు ఓటమిని చవిచూసింది. ఇండోనేషియా ఓపెన్‌లో భాగంగా బుధవారం జరిగిన తొలి రౌండ్‌లో చైనీస్ తైపీ షట్లర్‌ వెన్ చిహ్సు చేతిలో సిందు పరాజయం పాలైంది.

వరుసగా మూడు గేమ్స్‌లో 15-21, 21-15, 14-21 తేడాతో ఓడిన సింధు ఈ టోర్నీ నుంచి నిష్క్రమించింది. తొలి గేమ్‌లో ప్రత్యర్థికి గట్టి పోటీనిచ్చిన సింధు, రెండు రౌండ్‌లో మాత్రం అధ్భుతంగా పుంజుకొని వెన్‌ చిహ్సు ఓడించింది. కానీ ఫలితాన్ని తేల్చే మూడో గేమ్‌లో మాత్రం సింధు ప్రత్యర్థి ముందు తేలిపోయింది. దీంతో తొలి రౌండ్‌లోనే సింధు స్టోరీ ఎండ్ అయింది. కాగా పారిస్‌ ఒలింపిక్స్‌కు ముందు సింధుకు మిశ్రమ ఫలితాలు ఎదురవుతున్నాయి.

ఇక గతంలోనూ సింధు సింగపూర్ ఓపెనతో పాటు మలేషియా మాస్టర్స్‌ టోర్నీ ఫైనల్‌లో సింధు పరాజయం చవిచూసింది. దాంతో సింధు విజయం లాంఛనమేనని అంతా భావించారు. కానీ అనూహ్యంగా పుంజుకున్న కరోలినా మారిన్ వరుస పాయింట్లతో 20-22తో గేమ్‌ను సొంతం చేసుకోవడంతో పాటు మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. మరో రెండు నెలల్లో పారిస్ ఒలింపిక్స్ ప్రారంభం కానుండగా.. సింధు వరుస వైఫల్యాలు బ్యాడ్మింటన్ అభిమానులను కలవరపాటుకు గురి చేస్తున్నాయి. మరికొందరు అయితే అసలు సింధుకి ఏమైందని మండిపడుతున్నారు.

Just In

01

Panchayat Elections: పంచాయతీ పోరు రెండో దశలోనూ కాంగ్రెస్ హవా.. భారీ సంఖ్యలో పంచాయతీల కైవసం

MA Yusuff Ali: దుబాయ్‌లో పబ్లిక్ బస్సెక్కిన ఇండియన్ బిలియనీర్.. వైరల్‌గా మారిన వీడియో ఇదిగో!

VC Sajjanar: న్యూ ఇయర్ ఈవెంట్​ జరుపుతున్నారా?.. అయితే అనుమతి తప్పనిసరి!

Artificial Intelligence: ఏఐ రంగంలో భారత్ సరికొత్త రికార్డు.. గ్లోబల్ ర్యాంకింగ్‌లో మూడో స్థానం

Congress Election Strategy: రెండో విడత కాంగ్రెస్ కొత్త స్ట్రాటజీ.. మెజార్టీ స్థానాలపై ఫోకస్..!