IPL 2025: పాకిస్థాన్ సహా పాక్ ఆక్రమిత కాశ్మీర్ పై భారత్ జరిపిన వైమానిక దాడుల నేపథ్యంలో (Operation sindoor) ఇరుదేశాల మధ్య ఉద్రిక్తలు తారా స్థాయికి చేరాయి. భారత్ చర్యలకు కచ్చితంగా ప్రతి చర్యలు ఉంటాయని పాక్ ప్రధాని షహబాద్ షరీఫ్ ఎక్స్ వేదికగా వార్నింగ్ ఇచ్చారు. దీంతో పాక్ రియాక్షన్ ఎలా ఉంటుందోనన్న ఆందోళన భారతీయుల్లో నెలకొని ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం కీలక దశలో ఉన్న ఐపీఎల్ – 2025 సీజన్ భవితవ్యంపై నీలి నీడలు కమ్ముకున్నాయి.
బీసీసీఐకి సవాలు!
ప్రస్తుతం భారత్ – పాక్ (India vs Pak) మధ్య ఉద్రిక్తతలు పెరిగినందున టోర్నమెంట్ యథావిధిగా కొనసాగుతుందా? లేదా? అనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఈ సీజన్‌లో 56 మ్యాచ్‌లు ముగిశాయి. ప్లేఆఫ్స్ రేసు రసవత్తరంగా మారిన తరుణంలో, ఏడు జట్లు టాప్-4 స్థానాల కోసం తీవ్రంగా పోటీ పడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో టోర్నీని వాయిదా వేయాలా? లేదా రద్దు చేయాలా? అనేది ప్రస్తుతం బీసీసీఐ (BCCI)కి సవాలుగా మారిందని వార్తలు వస్తున్నాయి.
విదేశీ ఆటగాళ్ల భద్రత దృష్ట్యా!
అయితే ఐపీఎల్ కు బ్రేక్ ఇవ్వడం ఖాయమంటూ పలువురు నెటిజన్లు సైతం సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. కొద్ది రోజుల గ్యాప్ ఇచ్చి.. ఉద్రిక్తల చల్లారక తిరిగి మ్యాచ్ లు కొనసాగిస్తారని ప్రచారం జరుగుతోంది. విదేశీ ఆటగాళ్ల భద్రత దృష్ట్యా ఐపీఎల్ ను పోస్ట్ పోన్ చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచించినట్లు కూడా రూమర్లు వస్తున్నాయి.
Also Read: Operation Sindoor: మోదీకి చెప్పుకో అన్నారు.. చెప్తే ఏడుస్తున్నారు.. ఇదేం విచిత్రమో!
బీసీసీఐ క్లారిటీ!
అయితే ఐపీఎల్ గురించి పెద్ద ఎత్తున ఊహాగానాలు చక్కర్లు కొడుతుంటడంతో తాజాగా బీసీసీఐ వర్గాలు స్పందించాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి తమకు ఎటువంటి అధికారిక ఆదేశాలు అందలేదని తెలిపాయి. అయితే బీసీసీఐ ప్రస్తుత పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్లు చెప్పాయి. పరిస్థితులు మరింత కఠినంగా మారినప్పుడు ఐపీఎల్ మ్యాచ్ ల నిర్వాహణకు సంబంధించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఇప్పటివరకైతే షెడ్యూల్ ప్రకారమే టోర్నీ కొనసాగుతుందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
