Not The Right Time To Hardik Pandya Intriguing Captaincy Take On MI Loss
స్పోర్ట్స్

Mumbai Indians: ఇది సమయం కాదన్న హార్ధిక్‌ పాండ్యా

Not The Right Time To Hardik Pandya Intriguing Captaincy Take On MI Loss: ముంబయి ఇండియన్స్ జట్టులో స్టార్‌ ఆటగాళ్లున్నా సరే ఐపీఎల్‌ 17 సీజన్‌లో తమ స్థాయికి తగ్గట్లు ఆడటం లేదు. సోమవారం రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు తొమ్మిది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది ఈ టీమ్‌. ఈ సీజన్‌లో ముంబయి ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్‌ల్లో మూడు విజయాలను మాత్రమే సాధించింది. ఆ జట్టు ప్లే ఆప్స్‌కి వెళ్లాలంటే మిగిలిన మ్యాచ్‌ల్లో ఖచ్చితంగా నెగ్గాల్సిందే. రాజస్థాన్‌తో మ్యాచ్‌ జరిగిన అనంతరం ముంబయి కెప్టెన్ హార్ధిక్‌ పాండ్యా మాట్లాడారు.

బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌ విభాగాల వైఫల్యాలే జట్టు ఓటమికి కారణమని ఆయన పేర్కొన్నాడు. మేం చేజేతులా స్టార్టింగ్‌లో ఇబ్బందుల్లో పడ్డాం. తిలక్‌ వర్మ, నేహాల్‌ వధేరా బ్యాటింగ్‌ చేసిన తీరు చాలా అద్భుతంగా ఉందని కొనియాడారు. ఆరంభంలో వరుసగా వికెట్లు కోల్పోవడంతో కనీసం 180 స్కోరైనా చేస్తామని అనుకోలేదు. చివరి ఓవర్లలో ధాటిగా ఆడలేకపోయాం. ఫలితంగా 15 పరుగులు తక్కువగా స్కోర్‌గా చేశాం. పవర్‌ ప్లే స్టార్టింగ్‌లోనే మేం రాజస్థాన్‌పై ఒత్తిడి తెచ్చి వికెట్లు పడగొట్టాల్సింది. కానీ అలా అస్సలు జరగలేదు. ఆ జట్టు ఓపెనర్లు ఫ్రీగా ఆడారు.

Also Read:సరికొత్త రికార్డు సృష్టించిన భారత ఆటగాడు..

ఫీల్డింగ్‌లోనూ మా టీమ్ చాలా పొరపాట్లు చేశాం. మొత్తం మీద అత్యుత్తమంగా ఆడలేకపోయామని నా అభిప్రాయం. ఇక రాజస్థాన్ బ్యాటర్లు మాత్రం చాలా అద్భుతంగా రాణించారు. ఆటగాళ్ల వ్యక్తిగత ప్రదర్శన గురించి మాట్లాడటానికి ఇది టైం కాదు, అందరూ ప్రొఫెషనల్‌ క్రికెటర్లే. వారు నిర్వర్తించాల్సిన రోల్ ఏంటనేది వారికి మాత్రమే తెలుసు. ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే..ఆటలో చేసిన మిస్టేక్స్‌ నుంచి పాఠాలు నేర్చుకొని వచ్చే మ్యాచ్‌ల్లో ఇలాంటి తప్పులను మళ్లీ పునరావృతం చేయకూడదని కోరుతున్నాను. ఇక వ్యక్తిగతంగా లోపాలను జట్టు అంగీకరించాలి. వాటిని సరిచేసుకొని ముందుకు సాగాలి. నేను ఆటగాళ్లకు మద్దతు ఇవ్వడానికే ఇష్టపడుతాను. ఎల్లప్పుడూ మంచి క్రికెట్ ఆడటం, మా ప్రణాళికలకు కట్టుబడి ఉండటంపై దృష్టి సారిస్తారని హార్ధిక్‌ పాండ్యా వివరించారు.

Just In

01

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?