Natasha Restores Wedding Pics With Hardik Pandya: భారత జట్టు వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, నటాషా స్టాంకోవిక్ దంపతులు విడిపోతున్నారంటూ గత కొంతకాలంగా నెట్టింట ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా మొత్తం వీరి విడాకుల గురించే చర్చ జరుగుతోంది. నటాషా తన ఇన్‌స్టా అకౌంట్ నుంచి తమ వెడ్డింగ్ ఫోటోలను తొలగించడంతో పాటు, తన పేరు పక్కన పాండ్యా అనే సర్ నేమ్‌ను కూడా తొలగించింది. దీంతో విడాకుల రూమర్స్ స్టార్ట్ అయ్యాయి. అయితే విడాకుల వార్తలపై అటు నటాషా గానీ, ఇటు పాండ్యాగానీ ఎలాంటి అనౌన్స్‌మెంట్ చేయకపోవడంతో ఈ జంట విడిపోతుందనే పుకార్లకు మరింత బలం చేకూర్చేలా చేసింది.
ఈ క్రమంలోనే విడాకుల రూమర్స్‌కు నటాషా తాజాగా ఓ ట్విస్ట్ ఇచ్చింది. తమ పెళ్లి నాటి ఫొటోలను ఇన్‌స్టాలో తిరిగి రిస్టోర్ చేసి షాక్ ఇచ్చింది. ఇది చూసిన నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తూ ఎప్పటికీ ఇద్దరూ కలిసే ఉండండంటూ కామెంట్స్ చేస్తున్నారు. అసలేం జరిగిందంటే ఈ మధ్యే నటాషా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పాండ్యా పేరును తొలిగించింది. అంతేకాదు ఒకరు త్వరలోనే వీధుల్లోకి రానున్నారని పోస్ట్ కూడా పెట్టింది. ఆ పోస్ట్ అంతరార్థం ఈ జంట కథ కంచికి చేరినట్టేనని సోషల్ మీడియాలో పోస్ట్‌లు వైరల్ అయ్యాయి. గత కొంతకాలంగా పాండ్యా, నటాషాలు వ్యక్తిగత ఫొటోలు షేర్ చేయడం లేదు. నటాషా పుట్టిన రోజున కూడా పాండ్యా ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదు. ఇక అదే టైమ్‌లో ఇప్పటివరకు జరిగిన గత రెండు ఐపీఎల్‌లో నటాషా స్టాంకోవిచ్ స్టేడియానికి వచ్చి హార్దిక్‌ను ఉత్సాహపరిచింది. కానీ ఈ ఏడాది ఐపీఎల్‌లో మాత్రం నటాషా ఏ స్టేడియంలోనూ దర్శనమివ్వలేదు. దాంతో ఇద్దరి మధ్య దూరం పెరిగిందని, త్వరలోనే విడాకులు తీసుకోవడం ఖాయమని అనుకుంటున్నారంతా. ఒకవేళ అదే జరిగితే డైవర్స్ సెటిల్‌మెంట్ కింద పాండ్యా తన సంపాదనలో సగానికి పైగా అంటే 70 శాతం సమర్పించుకోవాల్సి ఉంటుందన్న వార్తలు వినిపించాయి.
Also Read: క్రికెట్‌పై కీలక వ్యాఖ్యలు
ఈ నేపథ్యంలోనే తాజాగా నటాషా ట్విస్ట్ ఇచ్చింది. తన పెళ్లి ఫొటోలను, ప్యాండ్యాతో ఉన్న ఫొటోలను ఇన్‌స్టాలో రీస్టోర్ చేసి విడాకుల రూమర్స్‌కు తెరదించింది. నటాషా ట్విస్ట్‌తో ఇప్పటికైనా వీరి విడాకుల రూమర్స్‌కు పుల్‌స్టాప్ పడుతుందో లేదో చూడాలి మరి.స్పెయిన్ మోడల్ అయిన నటాషాకు, పాండ్యాకు కరోనా సమయంలో పెళ్లి అయింది. ప్రస్తుతం ఈ జంటకు అగస్త్య అనే పిల్లాడు ఉన్నాడు. అయితే.. హార్దిక్, నటాషాలు ఈ మధ్యే రెండోసారి వివాహం చేసుకొని వార్తల్లో నిలిచారు. కొడుకు ఉన్నాక మళ్లీ పెండ్లి చేసుకోవడానికి కారణం ఎంటో తెలుసా..? 2020 మార్చి 31న అతికొద్ది మంది సమక్షంలో కోర్టులో హార్దిక్, నటాషాల పెళ్లి జరిగింది. అది కరోనా టైమ్ కావడంతో సాదాసీదాగా వీళ్లిద్దరూ మూడు ముళ్ల బంధంలోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే పరిస్థితులు చక్కబడ్డాక బంధు, మిత్రుల ముందు వైభవంగా మనువాడాలని హార్దిక్, నటాషాలు అప్పుడే నిర్ణయించుకున్నారు.