చాంపియన్స్ ట్రోఫీ టీమిండియాదేనన్న మైకెల్ క్లార్క్
టాప్ స్కోరర్ గా రోహిత్ నిలుస్తాడని వ్యాఖ్య
Michael clarke: ఎనిమిదేళ్ల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy) జరుగుతుండటంతో క్రికెట్ ప్రపంచంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎవరు విజేతగా నిలుస్తారు? ఎందుకు సదరు జట్టు గెలుస్తుందని ఒక్కొక్కరు ఒక్కోలా అంచనా వేస్తున్నారు. తాజాగా ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా భారత్ నిలుస్తుందని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకెల్ క్లార్క్ (Michael Clarke) జోస్యం చెప్పారు. ఇక ఈ టోర్నీలో టాప్ స్కోరర్ గా భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) నిలుస్తాడన్నారు. ఎందుకంటే ఒక్కసారి క్రీజులో కుదురుకుంటే రోహిత్ ను ఆపడం ఏ బౌలర్ తరం కాదని, ఇంగ్లండ్ తో సిరీస్ లో అతను ఫాం అందుకోవడం టీమిండియాకు (Indian Cricket Team) కలిసొస్తుందని వ్యాఖ్యానించాడు. రోహిత్ కు వన్డే ఫార్మాట్ అచ్చివచ్చిందని, అందుకే చాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలుస్తాడని క్లార్క్ తేల్చాడు. టోర్నీలో టాప్ వికెట్ టేకర్ గా ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ (Jofra Archer) నిలిచే అవకాశం కనిపిస్తుందన్నాడు. చాంపియన్స్ ట్రోఫీలో జట్టు పరంగా ఇంగ్లండ్ గెలుపు అవకాశాలు స్వల్పమేనన్నాడు. అయినా ఆ జట్టులో ఆర్చర్ సూపర్ స్టార్ అని చెబుతూ .. ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా ట్రావిస్ హెడ్ నిలుస్తాడని చెప్పాడు. ‘‘ట్రావిస్ హెడ్ ఐపీఎల్ ఫామ్ కొనసాగిస్తాడని ఆశిస్తున్నా. గత వన్డే ప్రపంచ కప్‌లోనూ కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు’’ అని క్లార్క్ ఆకాశానికెత్తాడు.
ఇవీ చదవండి