Mariyappan Breaks Record Win Gold High Jump World Para Athletics
స్పోర్ట్స్

Mariyappan: తన వైకల్యం ముందు రికార్డులు అన్నీ..!

Mariyappan Breaks Record Win Gold High Jump World Para Athletics:జపాన్‌లో దేశంలోని కోబేలో జరిగిన ఈవెంట్లో 1.88 మీటర్లు దూకి పసిడి ఒడిసిపట్టాడు 28 ఏళ్ల మరియప్పన్‌ తంగవేలు. అంతేకాకుండా భారత పారా అథ్లెట్‌లో సరికొత్త హిస్టరీని క్రియేట్‌ చేశాడు. వరల్డ్‌ పారా అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌ షిప్స్‌లో T63 హై జంప్‌ విభాగంలో భారత్‌కు తొలి స్వర్ణ పతకాన్ని అందించాడు.అంతేకాదు పనిలో పనిగా శరత్‌ కుమార్‌ పేరిట ఉన్న 1.83 మీటర్ల రికార్డు కూడా బద్దలు కొట్టాడు.

తమిళనాడుకు చెందిన మరియప్పన్‌ తంగవేలు ఐదేళ్ల వయసులో ఘోర ప్రమాదానికి గురయ్యాడు. తాగి బస్సు నడిపిన వ్యక్తి నిర్లక్ష్యం కారణంగా తన కుడికాలును శాశ్వతంగా పోగొట్టుకున్నాడు. అయితే తంగవేలు చదివే పాఠశాలలోని పీఈటీ సర్‌ అతడిని ఎంతగానో ప్రోత్సహించాడు. ఒంటికాలితోనే హై జంప్‌లో రాణించేలా శిక్షణ ఇచ్చాడు.తంగవేలు బాల్యం కూడా కష్టంగా గడిచింది. అతడి తల్లి రోజూ వారీ కూలీ. కొడుకును పోషించుకునేందుకు అప్పుడప్పుడు కూరగాయలు కూడా అమ్మేవారు.ఇలాంటి ఒడిదుడుకుల నడుమ పాఠశాల విద్య పూర్తి చేసిన తంగవేలు బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ సంపాదించాడు. చదువుకుంటూనే ఆటపై కూడా దృష్టి సారించిన అతడు జాతీయ స్థాయిలో ఎన్నో పతకాలు సాధించాడు.

Also Read:పారా అథ్లెటిక్స్‌లో వరల్డ్‌ రికార్డు సాధించిన ఓరుగల్లు బిడ్డ

అంచెలంచెలుగా ఎదిగిన తంగవేలు 2016 రియో పారాలింపిక్స్‌లో పసిడి పతకం గెలిచాడు. 2020 టోక్యో పారా ఒలింపిక్స్‌లో మాత్రం రజతంతో సరిపెట్టుకున్నాడు. హై జంప్‌లో విశేష ప్రతిభ కనబరిచిన తంగవేలును భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. అదేవిధంగా అర్జున అవార్డు కూడా ప్రదానం చేసింది. ఇక తంగవేలు 2020లో అత్యుత్తమ క్రీడా పురస్కారం ఖేల్‌ రత్న అందుకున్నాడు. ధ్యాన్‌ చంద్‌ అవార్డు కూడా గెలుచుకున్నాడు.వివిధ టోర్నీల్లో పతకాలు గెలవడం ద్వారా సంపాదించిన ప్రైజ్‌మనీ మొత్తాన్ని తంగవేలు పొలాలు కొనేందుకు వినియోగించాడు. తన తల్లి కోసం ఇంటిని కూడా నిర్మించి ఎందరికో ఆదర్శంగా నిలిచాడు.

Just In

01

Chamal Kiran Kumar: ఉద్యోగాల్లో కృత్రిమ మేధస్సు కీ రోల్.. ఎంపీ చామల కీలక వ్యాఖ్యలు

Peddi Update: రత్నవేలు ఇచ్చిన అప్డేట్‌తో రామ్ చరణ్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ!

Harish Rao: కవిత వ్యాఖ్యలపై.. తొలిసారి స్పందించిన హరీశ్‌ రావు

Srinivas Goud: వైన్స్ షాపుల్లో గౌడ్లకు 25శాతం ఇవ్వాల్సిందే… మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?