LSG Owner Sanjiv Goenka Makes Peace Offering To KL Rahul Amid Rumors Of RCB
స్పోర్ట్స్

IPL 2024: అప్పుడు ఫైర్, ఇప్పుడు జట్టు కోసం కూల్‌..

LSG Owner Sanjiv Goenka Makes Peace Offering To KL Rahul Amid Rumors Of RCB: లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌ను ఆ ఫ్రాంజైజీ ఓనర్‌ సంజీవ్ గోయెంకా బహిరంగంగా అవమానించారు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో పరాజయం అనంతరం మైదానంలోనే రాహుల్‌పై సంజీవ్ ఆవేశంగా మాట్లాడాడు. మరోవైపు కేఎల్ రాహుల్ మాత్రం మౌనంగా అలాగే నిలబడిపోయాడు. ఈ సంఘటన క్రికెట్‌ హిస్టరీలోనే తీవ్ర చర్చనీయాశంగా మారింది. కెప్టెన్‌తో అమర్యాదగా ప్రవర్తించడమేంటని లక్నో ఫ్రాంచైజీపై భారత మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పించారు.

వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్, మహ్మద్ షమి వంటి ఆటగాళ్లు రాహుల్‌కు అండగా నిలుస్తూ సంజీవ్ ప్రవర్తన తీవ్రంగా తప్పుబట్టారు. జట్టు సారథికి గౌరవం ఇవ్వాలని, ఏదైనా చర్చించాలనుకుంటే డ్రెస్సింగ్ రూమ్ లేదా నాలుగు గోడల మధ్యన చేయాలని అన్నారు. మరోవైపు ఈ సంఘటనతో కేఎల్ రాహుల్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జోరుగా సాగింది. గత రెండు సీజన్లలో జట్టును ప్లేఆఫ్స్ చేర్చిన విషయాన్ని మరిచి, ఓ పరాజయం గురించి అమర్యాదగా యజమాని ప్రవర్తించిన తీరుపై రాహుల్ చాలా బాధపడ్డాడని, దీంతో ఈ సీజన్ ముగిసిన అనంతరం లక్నో ఫ్రాంచైజీకి రాహుల్ గుడ్‌బై పలకనున్నాడనే వార్తలు చక్కర్లు కొట్టాయి.

Also Read: నో ఛాన్స్‌ అంటూ మాజీ ప్లేయర్‌ హాట్ కామెంట్స్

అంతేగాక తన సొంత రాష్ట్ర టీమ్ అయిన ఆర్‌సీబీ తరఫున కేఎల్ రాహుల్ బరిలోకి దిగుతున్నాడని కథనాలు వెల్లువెత్తాయి. డుప్లెసిస్ అనంతరం కెప్టెన్సీ బాధ్యతలు రాహుల్‌కు అందివ్వాలని బెంగళూరు ఫ్రాంచైజీ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుందని వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకా దారికొచ్చాడు. లక్నో జట్టును వీడకుండా కేఎల్ రాహుల్‌ను బుజ్జగించే పనులు స్టార్ట్‌ చేశాడు. మరి రాహుల్‌ ఈ టీమ్‌లో కొనసాగుతారో లేదో అనేది మాత్రం సస్పెన్స్‌గా మారింది.

Just In

01

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?