Vaibhav Suryavanshi: ఐపీఎల్ లో ఈ సీజన్ మొదటి నుంచి రాజస్థాన్ రాయల్స్ మంచిగా ఆడింది లేదు. చివరి మూడు మ్యాచ్లు గెలవాల్సినవి. కానీ, చివరి ఓవర్లో రన్స్ కొట్టలేకపోవడం వలన ఓడిపోయారు. ఇప్పటివరకు 10 మ్యాచులు ఆడగా.. మూడు మ్యాచులు మాత్రమే గెలిచారు. రన్ రేట్ కూడా మైనస్ లో ఉండటంతో ప్లే ఆఫ్ కు వెళ్ళే అవకాశం చాలా తక్కువగా ఉంది.
అయితే, పదో మ్యాచ్ గుజరాత్ టైటాన్స్ తో తలపడగా 15.5 ఓవర్లలోనే 212 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్ లో యంగ్ స్టార్, 14 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ తన విధ్వంసకర బ్యాటింగ్ తో రెచ్చిపోయాడు. ఒక్క మాటలో చెప్పాలంటే గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ లో చెలరేగిపోయి మరి ఆడాడు. అతనికి ఆటకి స్టేడియం మొత్తం ఫిదా అయ్యారు.
అతను పిచ్ లో ఉన్నంత సేపు బౌండరీల వర్షం కురిపించాడు. బాల్ బాల్ కి వెళ్తే సిక్స్ లేదంటే ఫోర్. ఈ నేపథ్యంలోనే వైభవ్ సూపర్ సెంచరీ చేశాడు. కేవలం 35 బాల్స్ కే 101 పరుగులు చేసి రికార్డ్ బ్రేక్ చేశాడు. సిక్సులు, ఫోర్ల వర్షం కురిపించాడు. ఏకంగా 11 సిక్సులు, 7 ఫోర్లు అలవోకగా కొట్టేశాడు.
మొదటి మ్యాచ్ లోనే మొదటి బాల్ కి సిక్స్ కొట్టి వార్తల్లో నిలిచాడు.ఇక తన రెండో మ్యాచ్ లో కూడా అదే ఫామ్ ను కొనసాగించాడు. 17 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు వైభవ్ సూర్యవంశీ. ఆ తర్వాత 35 బంతుల్లోనే శతకం బాదేశాడు. ఐపీఎల్ హిస్టరీలో సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ ఇదే. ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన రికార్డ్ క్రిస్ గేల్ పేరిట ఉంది. ఇక ఇప్పుడు ఐపీఎల్ లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన తొలి ఇండియన్ బ్యాటర్ గా వైభవ్ చరిత్ర సృస్టించాడు. కాగా, శతకం చేసిన వెంటనే వైభవ్ ఔటయ్యాడు. వైభవ్ చేసిన సంచలన బ్యాటింగ్ చూసి రాహుల్ ద్రవిడ్ పైకి లేచి మరీ ప్రశంసించాడు.