RR vs CSK: ఇండియన్ ప్రీమియల్ లీగ్ (Indian Premier League) లో అత్యంత ప్రజాధారణ కలిగిన జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) జట్టుకు పేరుంది. దాదాపుగా ప్రతీ సీజన్ లోనూ సెమీస్ చేరిన ఆ టీమ్.. ఇప్పటివరకూ 5 టైటిల్స్ (IPL Trophies) కైవసం చేసుకొని సత్తా చాటింది. అటువంటి సీఎస్కే (CSK)కు ఐపీఎల్ – 2025 (IPL 2025) సీజన్ కలిసి రావడం లేదు. ఈ సీజన్ లో ఆ జట్టు పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) తో జరిగిన మ్యాచ్ లో ఆ జట్టు దారుణ ఓటమిని చవి చూసి చెత్త రికార్డును మూటగట్టుకుంది.
ఆ రికార్డు ఏంటంటే?
చెన్నైతో జరిగిన మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ (RR).. నిర్ణిత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు సాధించింది. లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన సీఎస్కే.. 176 రన్స్ మాత్రమే చేసి ఈ సీజన్ లో వరుసగా రెండో ఓటమిని చవిచూసింది. ఇప్పటివరకూ ఆడిన మూడు మ్యాచ్ ల్లో ఒకటి మాత్రమే సీఎస్కే గెలవడం విశేషం. రాజస్థాన్ పై ఓటమి తర్వాత సీఎస్కే ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది. వరుసగా 9వ సారి 180+ పరుగులు ఛేదించలేని జట్టుగా వరస్ట్ రికార్డును మూటగట్టుకుంది. 2019 నుంచి 180+ ఛేదనకు దిగిన ఏ మ్యాచ్ లోనూ చెన్నై గెలవకపోవడాన్ని చూస్తే ఆ జట్టు ఏ స్థాయిలో బలహీనపడిందో అర్థం చేసుకోవచ్చని క్రీడావర్గాలు విమర్శలు చేస్తున్నాయి. ఇప్పటివరకూ ఏ జట్టు ఇలా వరుసగా 180+ ఛేదించలేక చతిలికపడింది.
ఘనతను చేజార్చుకొని..
రాజస్థాన్ తో మ్యాచ్ కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు.. బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ (RCB) టీమ్ తో ఒక మ్యాచ్ ఆడింది. అందులోనూ సీఎస్కే దారుణ పరాభవాన్ని చవి చూసింది. దీంతో 2008 నుంచి ఆర్సీబీ పై వస్తున్న రికార్డును సీఎస్కే కోల్పోయింది. చెన్నై చెపాక్ వేదికగా గత 17 ఏళ్లలో ఒక్క మ్యాచ్ కూడా ఆర్సీబీ నెగ్గలేదు. ఐపీఎల్ ఆరంభ సీజన్ అయినా 2008లో చెపాక్ లో తొలిసారి సీఎస్కేపై ఆర్సీబీ గెలిచింది. ఆ తర్వాత క్రితం మ్యాచ్ వరకూ ఆ జట్టుకు చెపాక్ లో ఒక్క విజయం నమోదు కాలేదు. చెన్నై తన పేలవ ఆటతీరుతో ఆర్సీబీ పై కొనసాగిస్తూ వస్తున్న రికార్డును కోల్పోయింది.
ధోనిపైనా విమర్శలు
టీమిండియా మాజీ సారథి ఎం.ఎస్ ధోని (MS Dhoni) ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఐపీఎల్ ప్రారంభం నుంచి ఇప్పటివరకూ కొనసాగుతున్న ఏకైక ప్లేయర్ అతడే. సీఎస్కేకు ఉన్న ఫ్యాన్ బేస్ లో దాదాపు సగానికి పైగా ధోనిని చూసి వచ్చిందే. అటువంటి ధోనిపై ఎన్నడూ లేని విధంగా ఈ సీజన్ లో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఆర్సీబీతో మ్యాచ్ లో అతడు 9వ స్థానంలో బ్యాటింగ్ కు రావడంపై ఫ్యాన్స్ సహా మాజీలు ఫైర్ అయ్యారు. గొప్ప ఫినిషర్ గా అయిన ధోని.. జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు సరైన సమయంలో బ్యాటింగ్ కు రాకపోవడంపై చాలా మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక రాజస్థాన్ పై జరిగిన మ్యాచ్ లోనూ ధోని మ్యాచ్ గెలిపిస్తాడని అంతా భావించగా.. చివరి ఓవర్ లో ఔటే అందరినీ నిరాశ పరిచాడు.
Also Read: Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో ఇక దంచుడే.. దంచుడు.. వర్షాలపై బిగ్ అప్ డేట్..
గైక్వాడ్ పేలవ కెప్టెన్సీ
సీఎస్కే సారథి రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) కెప్టెన్సీ పైనా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా బ్యాటర్లు, బౌలర్ల ఎంపికలో అతడు పూర్తిగా తేలిపోతున్నాడని ఫ్యాన్స్ తో పాటు క్రీడా వర్గాలు విమర్శలు చేస్తున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్ మ్యాచ్ లో అతడి పూర్ కెప్టెన్సీ బయటపడిందని అంటున్నారు. రాజస్థాన్ బ్యాటర్ నితీష్ రాణా పరుగులు వరద పారిస్తున్న క్రమంలో.. తమ ట్రంప్ కార్డ్ బౌలర్ అయినా నూర్ అహ్మద్ ను పవర్ ప్లేలో బౌలింగ్ చేయించకపోవడాన్ని చాలా మంది తప్పుబడుతున్నారు. అటు రవీంద్ర జడేజా (Ravindra Jadeja)ను కాస్త ముందు బౌలింగ్ కు తెచ్చి ఉంటే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. ఇకనైనా తప్పులు సరిదిద్దుకొని ఈ సీజన్ గట్టి కమ్ బ్యాక్ ఇవ్వాలని సీఎస్కేను అభిమానులు కోరుకుంటున్నారు.