ipl
స్పోర్ట్స్

IPL2025: బ్రూక్స్ పై వేటు… గాయాలతో వీరంతా గాయబ్

రీప్లేస్ మెంట్స్ తో ఫ్రాంచైజీల భర్తీ..

ఐపీఎల్ కు ప్లేయర్స్ రీప్లేస్ ..!

IPL2025: ఐపీఎల్(IPL) .. బిసిసిఐ మానసపుత్రిక..ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డుగా బిసిసిఐ ఎదగడంలో ఐపీఎల్ దే కీలకపాత్ర. ప్రపంచ క్రికెట్ ను షేక్ చేస్తూ..ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషీ చేస్తూ మరో వారం రోజుల్లో 18 వ సీజన్ స్టార్ట్ కాబోతోంది. ప్రపంచంలోని అగ్రశ్రేణి క్రికెటర్లు.. ధనాధన్ షాట్లతో క్రికెట్ ప్రేమికులను అలరించేందుకు సిద్ధమౌతున్నారు. ఈ నెల 22 నుంచి ఐపీఎల్ 18 వ సీజన్ కోల్ కతాలో ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ లో భాగంగా  ఈడెన్ గార్డెన్స్ లో డిఫెండింగ్ చాంపియన్ కేకేఆర్ తో   రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది.

కాగా, ఈ సీజన్ లో గాయపడిన లేదా వ్యక్తిగత కారణాలతో దూరమైన ప్లేయర్ల వివరాలు ఇలా ఉన్నాయి. పూర్తి సీజన్ కు దూరమైన వారిలో ఇంగ్లండ్ కు చెందిన హ్యారీ బ్రూక్ పై నిషేధం వేటు పడగా మిగిలిన ప్లేయర్లు తీవ్ర గాయం కారణంగా ఈ సీజన్ ఆసాంతం తప్పుకున్నారు.  గాయాలతో బ్రైడెన్ కార్స్( సన్ రైజర్స్ హైదరాబాద్), లిజాడ్ విలియమ్స్(ముంబై ఇండియన్స్), అల్లా ఘజన్ఫర్(ముంబై ఇండియన్స్) పూర్తి సీజన్ కు దూరమయ్యారు.

Also Read- Indian Cricketers: ఫైనల్స్‌లో మన పిసినారి బౌలర్లు.. ఐసీసీ ట్రోఫీ ఫైనల్స్ లో మోస్ట్ ఎకనామిక్ స్పెల్స్!

హ్యారీ బ్రూక్( ఇంగ్లండ్)

గత ఏడాది బామ్మ మరణాన్ని కారణంగా చూపుతూ ఐపీఎల్ నుంచి ఇంగ్లండ్ స్టార్ హ్యారీ బ్రూక్ తప్పుకున్నాడు. అయినా ఢిల్లీ  ఈ ఏడాది కూడా  అతన్ని రూ.6.21 కోట్లకు కొనుగోలు చేసింది. మిడిలార్డర్ లో సాలిడ్ బ్యాటింగ్ తో అదరగొట్టే ఈ ఇంగ్లండ్ స్టార్ ఈ సీజన్  కూడా ఐపీఎల్  ఆడలేనంటూ  ఝలక్ ఇచ్చాడు.  ఈ ఏడాదిలో తన జాతీయ జట్టు తరఫున ఆడాల్సిన సిరీస్ ల కోసం ఐపీఎల్‌ నుంచి తప్పుకుంటున్నట్లు తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశాడు. దీంతో బ్రూక్ వరుసగా రెండో సీజన్  నుంచి గాయం లేకుండానే తప్పుకున్నట్లైంది. వేలంలో అమ్ముడైన ఆటగాడు ఫిట్‌గా ఉండి వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్‌కు వరుసగా రెండు సీజన్లు దూరమైతే నిబంధనల ప్రకారం సదరు ఆటగాడిపై  రెండేళ్ల నిషేధం పడుతుంది. దీంతో బ్రూక్ పై  ఐపీఎల్ పాలకమండలి రేండేండ్ల నిషేధం విధించింది. హ్యారీ

బ్రూక్‌పై నిషేధం ఈ సీజన్‌ నుంచే అమల్లోకి వస్తుంది. ఒకవేళ ఐపీఎల్ లో పాల్గొనాలని భావిస్తే మళ్లీ 2027 సీజన్ లోనే అతనికి అవకాశం వస్తుంది. ఇక బ్రూక్ వైదొలగినా ఇంకా ఢిల్లీ కేపిటల్స్ టీమ్ అతనికి ప్రత్యామ్నాయ ప్లేయర్ గా ఎవరినీ ఎంపిక చేయలేదు.

బ్రైడెన్ కార్స్ (సన్ రైజర్స్ హైదరాబాద్)

ఇంగ్లండ్ కు చెందిన బ్రైడెన్ కార్స్ ..బౌలింగ్ ఆల్ రౌండర్. అద్భుతమైన పేస్ బౌలింగ్ తో అతను ఓపెనింగ్ లేదా డెత్ ఓవర్లలోనూ బౌలింగ్ చేయగలడు. అంతేకాదు ధనాధన్ బ్యాటింగ్ తో  అతను మిడిలార్డర్ లేదా ..లోయరార్డర్ లోనూ పరుగులు చేయగలడు. కాగా, కార్స్ భారత్ తో జరిగిన టీ20, వన్డే సిరీస్ లోనూ పాల్గొన్నాడు. కాగా, చాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్ సందర్భంగా కార్స్ గాయపడ్డాడు. దీంతో అతను ఈ ఏడాది ఐపీఎల్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. గతేడాది జరిగిన వేలంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు అతన్ని రూ.1 కోటి కి సొంతం చేసుకుంది. కార్స్ గాయంతో తప్పుకోవడంతో అతని ప్లేస్ లో రూ.75 లక్షలకు సౌతాఫ్రికా పేసర్ వియాన్ ముల్డర్ ను ఎంపిక చేసుకుంది. ముల్డర్ చాంపియన్స్ ట్రోఫీలో సూపర్ బౌలింగ్ తో అదరగొట్టిన సంగతి తెలిసిందే.

లిజాడ్ విలియమ్స్( ముంబై ఇండియన్స్)

సౌతాఫ్రికాకు చెందిన ఫాస్ట్ బౌలర్ లిజాడ్ విలియమ్స్. ఢిల్లీ తరఫున అతను ఐపీఎల్ లో అరంగేంట్రం చేశాడు. అతని బౌలింగ్ లో వేగం, కచ్చితత్వం ఉంటుంది. అద్భుతమైన లైన్ అండ్ లెంగ్త్ తో బౌలింగ్ చేసే అతన్ని ముంబై ఇండియన్స్ జట్టు 75 లక్షలకు వేలంలో సొంతం చేసుకుంది. ఇక ముంబై జట్టులో బుమ్రా, బౌల్ట్, దీపక్ చాహర్ లకు తోడుగా లిజాడ్ విలియమ్స్ తో ఫాస్ట్ బౌలింగ్ ను మరింత పటిష్టం చేసుకుంది. కాగా, అతను సౌతాఫ్రికా ఫాస్ట్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ కార్బిన్‌ బాష్‌ ను రీప్లేస్ చేసుకుంది. రైట్‌ హ్యాండ్‌ బ్యాట్‌, రైట్‌ ఆర్మ్‌ ఫాస్ట్‌ బౌలింగ్‌ వేసే బాష్‌ సౌతాఫ్రికా తరఫున ఓ టెస్ట్‌, 2 వన్డేలు ఆడాడు.  అంతేకాదు అతను రాజస్థాన్ రాయల్స్ జట్టుకు నెట్ బౌలర్ గానూ సేవలందించాడు. ఇప్పుడు ముంబై ఇండియన్స్ జట్టులో అతను ఎలా రాణిస్తాడో చూడాల్సిందే.

అల్లాఘజన్ఫర్( ముంబై ఇండియన్స్)

ఆఫ్ఘానిస్థాన్ కు చెందిన అల్లా ఘజన్ఫర్ అద్భుతమైన లెగ్ స్పిన్నర్. చాంపియన్స్ ట్రోఫీలో ఆడుతూ అతను గాయంతో టోర్నీతో పాటు ఐపీఎల్ సీజన్ మొత్తం దూరమయ్యాడు.  అతన్ని వేలంలో ముంబై జట్టు రూ.4.80 కోట్లు చెల్లించి సొంతం చేసుకుంది. ఇప్పటివరకు ముంబై జట్టులో ఫ్రంట్ లైన్ స్పిన్నర్ లేకపోవడంతో యువ ఘజన్ఫర్ కు పెద్ద మొత్తం చెల్లించినా ..గాయంతో అతను దూరం కావడంలో మరో ఆఫ్ఘానిస్థాన్ ఆఫ్ స్పిన్నర్ ముజీబ్ ఉర్ రెహ్మాన్ ను  రూ. 2 కోట్లు చెల్లించి రీప్లేస్ చేసుకుంది. ముజీబ్ ఇప్పటివరకు 19 ఐపీఎల్ మ్యాచ్ లు ఆడాడు. గతంలో పంజాబ్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లకు ప్రాతినిథ్యం వహించాడు.

Also Read- RCB – Kohli: ఆర్సీబి కథ మారేనా..? కోహ్లీ ఖాతాలో ఐపీఎల్ ట్రోఫీ చేరేనా..?

Just In

01

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్