Ipl 2024 Telugu Youth Player Nithish Kumar
స్పోర్ట్స్

Sports News: ఆ ఆటగాడికి భారీ డిమాండ్ 

Ipl 2024 Telugu Youth Player Nithish Kumar: ఐపీఎల్‌ 2024 సీజన్‌లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ యువప్లేయర్‌, తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి అద్భుత ప్రదర్శన కనబరిచాడు. 15 మ్యాచ్‌ల్లో 2 హాఫ్‌ సెంచరీలతో 303 రన్స్‌ చేశాడు. బౌలింగ్‌లో 3 వికెట్లు తీశాడు. ఈ ప్రదర్శనతో ఐపీఎల్‌ 2024 సీజన్‌లో ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు అందుకున్నాడు. తెలుగు టీమ్‌లో తెలుగోడు సత్తా చాటడం రెండు రాష్ట్రాల అభిమానులను సంతోషంలో ముంచెత్తింది. అయితే వచ్చే ఏడాది మెగా వేలం జరగనున్న నేపథ్యంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ నితీష్ కుమార్‌రెడ్డి రిటైన్‌ చేసుకుంటుందా లేదా అనే చర్చ జోరుగా సాగుతోంది.

ఐపీఎల్ 2025 మెగా వేలానికి సంబంధించిన రిటైన్ పాలసీ అయితే ఇంకా ఖరారు కాలేదు. కానీ 3+1 రిటెన్షన్‌కు అవకాశం ఇవ్వాలని బీసీసీఐ భావిస్తున్నట్లు నేషనల్ మీడియాలో కథనాలు వచ్చాయి. ఫ్రాంచైజీలు ముగ్గురిని నేరుగా రిటైన్ చేసుకోనుండగా.. మరొకరిని ఆర్‌టీఎమ్ రైట్ టు మ్యాచ్ కింద తీసుకోవచ్చు.ఈ రూల్ ప్రకారం వేలంలో ఏదైనా జట్టు తమ ఆటగాడిని కొనుగోలు చేస్తే ఆర్‌టీఎమ్ కింద ఆ ధరను చెల్లించి రిటైన్ చేసుకోవచ్చు. రిటైన్ పాలసీ ప్రకారం ఒక జట్టు గరిష్టంగా నలుగురిని 3+1 మాత్రమే అంటిపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇందులో ముగ్గురు భారత క్రికెటర్లు, ఒక విదేశీ క్రికెటర్ లేదా ఇద్దరు భారత క్రికెటర్లు, ఇద్దరు విదేశీ క్రికెటర్లు మాత్రమే ఉండాలి.

నితీష్ రెడ్డిని రిటైన్ చేసుకున్నా అతనికి కనీసం రూ. 6 కోట్ల ధర దక్కనుంది. ఒక వేలంలోకి వదిలేసినా.. ఈ తెలుగు కుర్రాడి కోసం ఫ్రాంచైజీలు ఎగబడనున్నాయి. ముఖ్యంగా ఆర్‌సీబీ, ముంబై ఇండియన్స్, కేకేఆర్, సీఎస్‌కే, గుజరాత్ టైటాన్స్ ఈ తెలుగు కుర్రాడి కోసం వేలంలో పోటీ పడనున్నాయి. బ్యాటింగ్ చేయడంతో పాటు బౌలింగ్ చేసే సామర్థ్యం ఉండటం నితీష్ కుమార్ రెడ్డికి ప్లస్ పాయింట్.

Just In

01

Mahabubabad District: మహబూబాబాద్‌లో కుక్కల స్వైర విహారం.. పట్టించుకోని అధికారులు

Maoist Ashanna: మావోయిస్టు ఆశన్న సంచలన వీడియో.. ఏమన్నారంటే..?

Kishan Reddy: జూబ్లీహిల్స్‌లో రౌడీయిజం పెరిగిపోయింది: కిషన్ రెడ్డి సంచన వ్యాక్యలు

Private Colleges: నవంబర్ 3 నుంచి రాష్ట్రంలో ప్రైవేట్ కాలేజీల బంద్..?

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..