IPL -2024 Season -17 CSK Captain Change
స్పోర్ట్స్

Sports News: ధోనీ ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్, CSK కొత్త కెప్టెన్‌!

IPL -2024 Season -17 CSK Captain Change: 2024 ఐపీఎల్‌ 17వ సీజన్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగబోతున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌ సెన్సేషనల్ డెసీషన్ తీసుకుంది. సీఎస్‌కే కెప్టెన్సీ నుంచి ధోనీ తప్పుకున్నట్లు తెలిపింది. ఈ సీజన్ మొత్తానికి రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వం వహించనున్నట్లు టీమ్ మెనేజ్ మెంట్ అఫీషియల్‌గా అనౌన్స్‌ చేసింది. ఈ సీజన్‌ ఆరంభానికి కొద్దిరోజుల ముందు ధోని ఫేస్‌బుక్‌ వేదికగా చేసిన పోస్టు అభిమానులను ఉత్కంఠకు గురి చేసింది. న్యూ రోల్‌ అంటూ ధోని క్యాప్సన్ పెట్టడంతో సీఎస్కే కెప్టెన్సీ గురించే అంటూ పెద్ద ఎత్తున్న చర్చ మొదలైంది. న్యూ సీజన్‌లో న్యూ రోల్‌ కోసం ఆసక్తికరంగా వేచి చూస్తున్నా. స్టే ట్యూన్డ్‌ అంటూ పోస్ట్‌ పోస్ట్‌ చేయగా సోషల్‌మీడియాలో తెగ వైరల్‌ అయింది.

దీంతో ధోని ధోని కొత్త రోల్‌ అంటే ఓపెనర్‌గా వస్తాడని కొందరు.. కెప్టెన్సీని వదిలేస్తున్నాడని మరికొందరు వాదిస్తుండగా ఎట్టకేలకు ఉత్కంఠకు తెరపడింది. మరోవైపు ధోని ఈ సీజన్‌లో మెంటార్‌గా ఉండబోతున్నాడంటూ కూడా నెట్టింట వాదనలు వినిపించాయి. మార్చి 22 నుంచి ఐపీఎల్ 17 లీగ్ షురూ కాబోతోంది. శుక్రవారం మొదటి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు తలపడనున్నాయి.

Read More: డోంట్ కాల్ కింగ్‌, వైరల్ అవుతున్న కోహ్లీ డైలాగ్స్‌

ఐపీఎల్ 2024 సీజన్ తో ధోని ఆటకు పూర్తిస్థాయిలో వీడ్కోలు పలకనున్నట్టు కూడా వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. ఐపీఎల్ 2021 సీజన్‌లో ఒంటిచేత్తో జట్టుకు టైటిల్ అందించిన రుతురాజ్ గైక్వాడ్‌ను సిఎస్కే తదుపరి కెప్టెన్‌గా ఎంపిక చేయాలని ఆ టీం మేనేజ్‌మెంట్ ఎప్పటినుంచో భావించినట్టు కూడా తెలుస్తోంది. ఐపీఎల్ 2021 లో 635 పరుగులతో ఆరెంజ్ క్యాప్ అందుకున్న రుతురాజ్, ఐపిఎల్ 2022లో మాత్రం విఫలమయ్యాడు. అయితే దేశవాలి క్రికెటర్ లో అతను నిలకడగా రాణించాడు. సయ్యద్ ముస్తాక్ ఆలీ ట్రోఫీతో పాటుగా.. ముగిసిన మ్యాచ్‌లోనూ విజయ్ హజారే ట్రోఫీలో దుమ్మురేపాడు.

 

 

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!