IPL 2024 Plessis Reveals Reason Behind RCB Loss To Rajasthan Royals
స్పోర్ట్స్

IPL 2024: బెంగళూరు ఓటమికి రీజన్ ఇదేనా..!

IPL 2024 Plessis Reveals Reason Behind RCB Loss To Rajasthan Royals: ఐపీఎల్‌లో రాయల్‌ ఛాలెంజ్ బెంగళూరు ఓటమి పరంపర కొనసాగుతూనే ఉంది. వరుసగా నాలుగో మ్యాచ్‌లోనూ బెంగళూరు ఓటమిని చవిచూసింది. విరాట్‌ కోహ్లీ శతకంతో చెలరేగినా సరే బెంగళూరుకు మాత్రం ఓటమి తప్పలేదు. కింగ్‌ కోహ్లీ ఈ ఐపీఎల్‌ సీజన్‌లోనే తొలి శతకంతో చెలరేగిన వేళ రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 183 రన్స్‌ చేసింది. అనంతరం 184 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్‌ మరో 5 బంతులు మిగిలి ఉండగానే తన లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. జోస్‌ బట్లర్‌, సంజు శాంసన్‌ విధ్వంసంతో రాజస్థాన్‌ బెంగళూరుపై విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో బెంగళూరు ఓటమికి కారణాలు చూస్తే ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన బెంగళూరుకు ఓపెనర్లు శుభారంభం అందించారు. విరాట్ కోహ్లీ, ఫాఫ్‌ ప్లెసిస్ తొలి వికెట్‌కు 84 బంతుల్లోనే 125 రన్స్‌ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కానీ డు ప్లెసిస్ ఔటైన తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్ ఈ ఆరంభాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు. దీని కారణంగా బెంగళూరు తన స్కోరు 200 రన్స్‌ని దాటలేకపోయింది. డుప్లెసిస్‌ వికెట్ పడిన తర్వాత వచ్చిన గ్లెన్ మాక్స్‌వెల్ ఒక్క పరుగుకే ఔటయ్యాడు. సౌరవ్ చౌహాన్ కూడా 9 రన్స్‌ చేసి పెవిలియన్‌కు చేరాడు. కెమెరాన్ గ్రీన్ 5 పరుగులు మాత్రమే చేయగలిగాడు.

తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ కష్టమైందని బెంగళూరు కెప్టెన్‌ డుప్లెసిస్‌ అన్నాడు. కానీ రెండో ఇన్నింగ్స్‌లో మంచు వల్ల బ్యాటింగ్ చేయడం సులభతరమైందని తెలిపాడు. మంచు కారణంగా బెంగళూరు బౌలర్లు, బంతిపై నియంత్రణ కోల్పోయారు.184 రన్స్‌ లక్ష్యాన్ని ఛేదించేందుకు వచ్చిన రాజస్థాన్ జట్టు తొలి 5 ఓవర్లలో 34 రన్స్‌ మాత్రమే చేయగలిగింది. కానీ ఆరో ఓవర్లో బౌలింగ్‌కు వచ్చిన మయాంక్ దాగర్, ఒక్క ఓవర్‌లోనే 20 రన్స్‌ ఇవ్వడంతో ఊపు రాజస్థాన్ వైపు వెళ్లింది. మయాంక్ డాగర్ ఒక్క ఓవర్లో 20 రన్స్‌ ఇవ్వడంతో తమపై ఒత్తిడి పెరిగిందని కెప్టెన్‌ డు ప్లెసిస్ కూడా అంగీకరించాడు. డాగర్ కేవలం 2 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసి ఏకంగా 34 రన్స్ ఇచ్చాడు.

Also Read: అభిషేక్‌ శర్మపై టీమిండియా మాజీ ప్లేయర్‌ ఫైర్

రాజస్థాన్‌పై బెంగళూరు ఫీల్డింగ్‌ చాలా సింపిల్‌గా ఉంది. క్యాచ్‌లు చేజారాయి. దీంతో ఈ మ్యాచ్‌ను బెంగళూరు నుంచి లాగేసుకుంది. జైస్వాల్ రూపంలో తొలి వికెట్‌ను సున్నాకి కోల్పోయి రాజస్థాన్ రాయల్స్ జట్టును ఆర్‌సీబీ ఒత్తిడిలో పడేసింది. కానీ అదే టైంలో ఆర్‌సీబీకి మరో వికెట్ దక్కే ఛాన్స్‌ వచ్చింది. బట్లర్ 6 పరుగుల వద్ద క్యాచ్ ఇవ్వగా, కామెరాన్ గ్రీన్ ఆ బంతిని మిస్ చేశాడు. గ్లెన్ మాక్స్‌వెల్ బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు RCBకి చివరి 5 ఓవర్లు మిగిలి ఉన్నాయి. కానీ మ్యాక్సీ అవుట్‌ కావడంతో జట్టు స్కోరు వేగం పుంజుకోలేదు. కేవలం 3 బాల్స్‌లో ఒక్క పరుగు చేసి మాక్స్‌వెల్‌ ఔట్ అయ్యాడు. మరోవైపు ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 72 బంతుల్లో 113 రన్స్‌ చేశాడు. ఈ మ్యాచ్‌లో ఓటమికి విరాట్ కోహ్లీ కూడా ఓ కారణమని పలువురు భావిస్తున్నారు. ఎందుకంటే కోహ్లీ ఇన్నింగ్స్ చాలా స్లోగా ఉందని చెబుతున్నారు.

Just In

01

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు