IPL 2024 Match Live Score Today GT vs CSK Match 59
స్పోర్ట్స్

IPL 2024: ఆ టీమ్‌కి ఇదే లాస్ట్‌ ఛాన్స్‌

IPL 2024 Match Live Score Today GT vs CSK Match 59: గత కొన్నిరోజులుగా జరుగుతున్న ఐపీఎల్ పోరు చివరి దశకు చేరుకుంది.ఇందులో భాగంగా నేడు మరో సూపర్ ఫైట్ జరగనుంది. చెన్నై సూపర్ కింగ్స్‌తో గుజరాత్ టైటాన్స్ తలపడనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం ఈ మ్యాచ్‌కు ఆతిధ్యమిస్తుంది. ప్లే ఆఫ్‌కు వెళ్లాలంటే ఇరు జట్లకు ఈ మ్యాచ్ అత్యంత కీలకంగా మారింది. చెన్నై జట్టును పక్కనపెడితే గుజరాత్‌కు ఈ మ్యాచ్ చావో రేవో లాంటిది.ఈ మ్యాచ్ లో ఓడిపోతే గిల్ సేన టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఇప్పటికే వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయిన గుజరాత్ తీవ్ర ఒత్తిడిలో కనిపిస్తుంది.

ముఖ్యంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై వరుసగా రెండు ఘోర ఓటములు ఆ జట్టు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది. కెప్టెన్ గిల్ టోర్నీ ప్రారంభంలో అదరగొట్టినా..ఆ తర్వాత బ్యాట్ ఝళిపించలేకపోతున్నాడు. సాయి సుదర్శన్ మినహాయిస్తే నిలకడగా ఆడే ఆడే ఆటగాళ్లు ఎవరూ లేరు. ఇక బౌలింగ్ లో అందరూ విఫలమవుతుంటే ఆదుకుంటాడుకుంటాడనుకున్న రషీద్‌ఖాన్ భారీగా పరుగులు సమర్పించుకుంటున్నారు.

Also Read:సంజూ బ్యాడ్ లక్

ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడితే 4 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది. మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో గెలిస్తేనే ప్లే ఆఫ్ ఛాన్స్‌లు సజీవంగా ఉంటాయి. ఒక్క మ్యాచ్ ఓడిపోయినా టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. మరోవైపు చెన్నై సూపర్ ఫామ్‌లో ఉంది. ఆడిన 11 మ్యాచ్‌ల్లో 6 విజయాలు సాధించింది. మరో మూడు మ్యాచ్‌ల్లో రెండు గెలిచినా ప్లే బెర్త్ కన్‌ఫర్మ్ చేసుకుంటుంది. ఈ మ్యాచ్‌లోనే గెలిచి ప్లే ఆఫ్‌కు చేరువవ్వాలని భావిస్తుంది. మరి ఏ జట్టు ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తుందో తెలియాలంటే ఐపీఎల్ ముగిసే వరకు వేచి చూడ‌కతప్పదు.

 

Just In

01

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!