Inzamam ul Haq Attacks BCCI
స్పోర్ట్స్

Sports news:ఇంజమామ్..అంతే ఇక మారడు!!

Inzamam ul Haq Attacks BCCI.. Says Different Rules Exist for India at 2024 T20 World Cup:

2024 టీ20 వరల్డ్ కప్ లో ఫైనల్ కు చేరుకున్న భారత్ పై పాకిస్థాన్ మాజీ క్రియెటర్ ఇంజమామ్-ఉల్-హక్ అక్కసు వెళ్లగక్కుతున్నాడు. భారత్ పై మరోసారి నోరు పారేసుకున్నాడు. సూపర్ -8 లో ఆస్త్రేలియా మ్యాచ్ లో టీమ్ ఇండియా బాల్ ట్యాంపరింగ్ కు పాల్పడిందని అన్నారు. అందుకే భారత బౌలర్ అర్ష్ దీప్ సింగ్ 15వ ఓవర్ లో రివర్స్ స్వింగ్ రాబట్టగలిగాడని అంటున్నాడు ఇంజమామ్. అంతేకాదు బీసీసీఐ 2024 టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్స్ పైనా విమర్శలు చేశాడు. టీ20 వరల్డ్ కప్ 2024లో భారత్ కు ప్రత్యేకమైన నిబంధనలు ఉన్నాయని అన్నాడు. టోర్నీ ప్రారంభానికి ముందే టీమిండియా సెమీ ఫైనల్ వేదికను ముందే నిర్ణయించింద‌న్న ఇంజ‌మామ్‌.. ఇది అన్యాయమని పేర్కొన్నాడు. పాకిస్థాన్ ఎప్పుడూ అలాంటి ప్రయోజనాలను పొందలేదని చెప్పుకొచ్చాడు. భారత్ సెమీఫైనల్‌కు రిజర్వ్ డే లేకపోవడం కూడా భారత్‌కు అనుకూలంగా ఉండాలని ముందే నిర్ణయించుకున్నట్లు ఇంజమామ్ తెలిపాడు. పాకిస్థాన్ 24 న్యూస్ ఛానెల్‌లో ప్ర‌సార‌మ‌య్యే హంగామా షోలో కనిపించిన ఇంజమామ్ ఇలా వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశాడు. “మీరు రెండు సెమీ ఫైనల్‌లను గ‌మ‌నిస్తే, భారత్-ఇంగ్లండ్‌ మ్యాచ్‌కు మాత్రమే రిజర్వ్ డే లేదు. ఎందుకంటే టీమిండియా వారి గ్రూప్ ద‌శ‌లో అన్ని మ్యాచ్‌లలో గెలిచింది. ఒక‌వేళ సెమీస్ ర‌ద్దు అయితే వారు నేరుగా ఫైనల్‌కు అర్హత సాధిస్తారు” అని అన్నాడు.

ఆ విషయంలో పాక్ కు అన్యాయం

ఒక్కో మ్యాచ్‌కి వేర్వేరు నియమాలు ఉన్నాయ‌ని తెలిపాడు. “పాకిస్థాన్ ఆసియా కప్‌లో బలమైన స్థితిలో ఉన్నప్పుడు, మాకు ఉన్న‌ట్టుండి కేవలం ఒక మ్యాచ్ కోసం రిజర్వ్ డే వచ్చింది” అని చెప్పాడు. ప్రస్తుతం ఇంగ్లండ్‌ కూడా ఏమీ చేయలేనంత ఉన్న‌త‌స్థాయిలో భారత్‌ ఉంది. క్రికెట్‌ను కేవలం ఒక శక్తి మాత్రమే నడుపుతోంద‌ని బీసీసీఐని ఉద్దేశించి ఇంజమామ్ అన్నాడు.ఇంజమామ్ వ్యాఖ్యలపై షో యాంకర్ స్పందిస్తూ.. బీసీసీఐకి ఉన్న ఆర్థిక బ‌లం ఒక కారణమన్నారు. అయితే, క్రికెట్‌లో ఇలా అన్యాయ‌మైన‌ మార్గంలో త‌మ‌కు ఫేవ‌ర్‌గా నిర్ణ‌యాల‌ను మార్చుకోవ‌డం మంచి కాద‌ని హితువు ప‌లికారు.
ఇక సూప‌ర్‌-8లో ఆసీస్‌తో మ్యాచ్‌లో 15వ ఓవర్‌లో అర్ష్‌దీప్ సింగ్ రివర్స్ స్వింగ్‌ని రాబ‌ట్ట‌డంపై భారత్ బాల్ ట్యాంపరింగ్ చేసి ఉండవచ్చని ఇంజమామ్ అనుమానం వ్య‌క్తం చేశాడు. ఆయ‌న ఆరోపణలను టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తీవ్రంగా ఖండించాడు. ఇంజమామ్ విషయాలను ఓపెన్ మైండ్‌తో చూడాలని సూచించాడు. కొంచెం బుర్రా పెట్టి ఆలోచిస్తే అన్ని క‌రెక్టుగా అర్థమ‌వుతాయ‌న్నాడు.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!