Interesting Facts About Sunrisers Hyderabad Owner Kaviya Maran Networth
స్పోర్ట్స్

Kaviya Maran: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఓనర్‌ ప్రాపర్టీ ఎంతంటే..

Interesting Facts About SRH Owner Kaviya Maran Networth: ఐపీఎల్‌ చూసే వారికి ఈమె గురించి స్పెషల్‌ ఇంట్రడక్షన్‌ ఇవ్వాల్సిన పనిలేదు. ఎందుకంటే సన్‌రైజర్స్‌ హైదరాబాద్ జట్టు ఎంత ఫేమస్సో.. అంతకు మించి ఫేమస్ ఈమె. ఇంతకీ ఎవరామె అనుకుంటున్నారా.. ఆవిడే సన్‌ రైజర్స్‌ యజమాని కావ్య మారన్.!

హైదరాబాద్ మ్యాచ్ ఆడుతోందంటే చాలు, కెమెరాలన్నీ ఈమె వైపే టర్న్‌ అవుతాయి. ఆమె ఎక్స్‌ప్రెషన్స్‌ను క్యాప్చర్ చేసేందుకు పోటీ పడతాయి. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు సంబంధించిన అని వ్యహారాలను కావ్య మారన్ స్వయంగా చూసుకుంటుంది. వేలం నుంచి జట్టు వ్యూహాల వరకు ఫ్రాంచైజీ సహా.. అన్ని బాధ్యతలను పర్యవేక్షిస్తుంటుంది. 2018 నుంచి SRH సీఈవోగా వ్యవహరిస్తోంది. స్టేడియంలో సందడి చేస్తూ సెలెబ్రిటీలకు ఏమాత్రం తగ్గని రేంజులో ఫాలోవర్స్‌ను సంపాదించుకుంది. ఇంతకీ ఎవరు ఈమె అనుకుంటున్నారా?.. తమిళ బిజినెస్ టైకూన్, సన్‌ గ్రూప్ ఫౌండర్ కళానిధి మారన్ ఒక్కగానొక్క కూతురే ఈ కావ్య మారన్. కావ్య మారన్ 1992 ఏప్రిల్‌ ఆరున చెన్నైలో పుట్టింది. ఈమె తల్లి పేరు కావేరీ మారన్. సోలార్ టీవీ కమ్యూనిటీ రిస్ట్రిక్టెడ్‌కు సీఈవోగా ఉన్నారు. కావ్య మారన్ కామర్స్‌లో డిగ్రీ కంప్లీట్ చేసింది.

Read More:హార్దిక్, ధోనీలా ఆలోచించు, ఇజ్జతేం పోలేదు: మాజీ క్రికెటర్

ఆ తర్వాత యూకేలో ఎంబీఏ చదివింది. కళానిధి మారన్‌కు చెందిన దాదాపు రూ.33 వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి కావ్యనే వారసురాలు. కొన్ని నివేదికల ప్రకారం కావ్య మారన్ వ్యక్తిగత ఆస్తుల విలువ రూ.417 కోట్లు. సన్‌రైజర్స్‌తో పాటు, సన్‌ గ్రూప్ వ్యహారాలను కూడా కావ్య చూసుకుంటోంది. సౌతాఫ్రికా టీ-20 లీగ్‌లో సన్‌రైజర్స్ ఈస్ట్రన్ కేప్ జట్టు వరుసగా రెండు సీజన్లలో విజయం సాధించింది. గత మూడు సీజన్లుగా ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ దారుణంగా వైఫల్యాలు చవిచూసింది. మూడు సీజన్లలోనూ ఫ్యాన్స్‌ని నిరాశపరిచింది. 2021,22లో పాయింట్ల పట్టికలో 8వ స్థానంతో సరిపెట్టుకుంది. గత సీజన్‌లో చివరి స్థానానికి పరిమితం అయ్యింది. 2024లో అయినా హైదరాబాద్ టీమ్ మెరుగ్గా రాణించి కావ్య మొహంలో సంతోషం నింపాలని అటు SRH అభిమానులు, ఇటు ఈమె ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు.

Just In

01

Mahabubabad District: మహబూబాబాద్‌లో కుక్కల స్వైర విహారం.. పట్టించుకోని అధికారులు

Maoist Ashanna: మావోయిస్టు ఆశన్న సంచలన వీడియో.. ఏమన్నారంటే..?

Kishan Reddy: జూబ్లీహిల్స్‌లో రౌడీయిజం పెరిగిపోయింది: కిషన్ రెడ్డి సంచన వ్యాక్యలు

Private Colleges: నవంబర్ 3 నుంచి రాష్ట్రంలో ప్రైవేట్ కాలేజీల బంద్..?

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..