Olympic Games | క్వాలిఫయింగ్‌ టోర్నీలో ఆ జట్టుకు నిరాశ
Indian Womens Archery Team Face Setback In Olympic Qualifiers Still Hopeful
స్పోర్ట్స్

Olympic Games: క్వాలిఫయింగ్‌ టోర్నీలో ఆ జట్టుకు నిరాశ

Indian Womens Archery Team Face Setback In Olympic Qualifiers Still Hopeful: భారత మహిళల ఆర్చరీ జట్టు టాప్‌ 4లో నిలిచింది. కానీ పారిస్‌ వేదికగా జరగబోయే ఒలింపిక్స్‌ క్రీడలకు చోటు దక్కించుకోవాలనుకున్న ఆ టీమ్‌కి నిరాశే ఎదురైంది. ఫైనల్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీలో దీపిక కుమారి, అంకిత, భజన్‌ కౌర్‌లతో కూడిన భారత మహిళల రికర్వ్‌ జట్టు రెండో రౌండ్‌లోనే వెనుదిరిగింది. భారత జట్టుతో వెరోనికా, అనస్తాసియా, ఒలాలతో కూడిన ఉక్రెయిన్‌ జట్టు చేతిలో ఓడిపోయింది. ఈ టోర్నీలో సెమీ ఫైనల్‌కు చేరిన చైనా, చైనీస్‌ తైపీ, మలేసియా, బ్రిటన్‌ జట్లు ఒలింపిక్స్‌కు అర్హత సాధించాయి.

క్వాలిఫయింగ్‌ టోర్నీలో ఓడినప్పటికీ భారత జట్టుకు వరల్డ్‌ ర్యాంకింగ్‌ ద్వారా పారిస్‌ ఒలింపిక్స్‌కు అర్హత పొందే చివరి చాన్స్ మిగిలి ఉంది. ప్రస్తుతం ర్యాంకింగ్స్‌లో 8వ స్థానంలో ఉన్న భారత్‌.. ర్యాంకుల ఆధారంగా విశ్వక్రీడల్లో బరిలోకి దిగే చాన్స్‌ ఉంది. ప్రపంచకప్‌ స్టేజ్‌3 టోర్నీ ముగిశాక ఈనెల 24న ప్రపంచ ర్యాంకింగ్స్‌ రిలీజ్ చేస్తారు.

Also Read: ఆటగాడు ఆల్‌టైం రికార్డు

ఇప్పటికీ ఒలింపిక్స్‌కు అర్హత పొందని రెండు ఉత్తమ ర్యాంక్‌ జట్లకు పారిస్‌ బెర్త్‌లు ఖరారు అవుతాయి. ఇప్పటివరకు ఫ్రాన్స్, జర్మనీ, కొరియా, మెక్సికో, నెదర్లాండ్స్, అమెరికా, చైనా, చైనీస్‌ తైపీ, మలేసియా, బ్రిటన్‌ జట్లు పారిస్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధించాయి. చివరి రెండు బెర్త్‌లను వరల్డ్‌ ర్యాంకింగ్‌ ద్వారా ఖరారు చేస్తారు.

Just In

01

45 Official Trailer: శివరాజ్ కుమార్, ఉపేంద్రల అరాచకం.. ఎండింగ్ డోంట్ మిస్!

Akhanda 2: ‘అఖండ 2’ సక్సెస్ మీట్‌కు నిర్మాతలు ఎందుకు రాలేదు? భయపడ్డారా?

Suriya46: ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’‌ను తలపిస్తోన్న సూర్య – వెంకీ అట్లూరి మూవీ టైటిల్!

Vishnu Vinyasam: శ్రీ విష్ణు నెక్ట్స్ సినిమా టైటిల్ ఇదే.. టైటిల్ గ్లింప్స్ అదిరింది!

Minister Seethakka: మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని చంపే కుట్ర: మంత్రి సీతక్క