Indian Boxer | బెర్త్‌ ఖరారు చేసుకున్న భారత బాక్సర్
Indian Boxer Amit Panghal Qualifies Paris Olympics
స్పోర్ట్స్

Indian Boxer: బెర్త్‌ ఖరారు చేసుకున్న భారత బాక్సర్

Indian Boxer Amit Panghal Qualifies Paris Olympics: భారత్‌కి చెందిన బాక్సర్‌ అమిత్‌ పంఘాల్‌, భారతీయసేన జూనియర్ కమీషన్ అధికారి.2021లో ఆసియా అమెచ్యూర్ బాక్సింగ్‌ చాంఫియన్‌షిప్‌లో సంఘాల్ రజత పతకాన్ని గెలుచుకున్నాడు. 2022లో జరిగిన కామన్వెల్త్‌ గేమ్స్51 కిలోగ్రాముల ఐకడొనాల్డ్ కే ఖిలాఫ్ 5-0 నిర్ణయంతో బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. పారిస్‌ ఒలింపిక్స్‌ 2024కు అర్హత సాధించాడు.

సెకండ్‌ వరల్డ్‌ క్వాలిఫికేషన్‌ టోర్నమెంట్‌లో చైనా బాక్సర్‌ చువాంగ్‌‌ లియూను ఓడించి విశ్వ క్రీడల్లో పాల్గొనేందుకు బెర్త్ ఖరారు చేసుకున్నాడు. బ్యాంకాక్‌ వేదికగా ఆదివారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్‌ పోరులో చువాంగ్‌ను 5-0తో చిత్తు చేశాడు అమిత్‌ పంఘాల్‌. ఈ క్రమంలో పారిస్‌ ఒలింపిక్స్‌లో 51 కేజీల విభాగంలో పోటీ పడేందుకు వరల్డ్‌ చాంపియన్‌షిప్స్‌ రజత పతక విజేత అర్హతని సాధించాడు.

Also Read: పెద్దల సమక్షంలో ఒక్కటైన జంట

కాగా భారత్‌ నుంచి ఈసారి విశ్వ క్రీడల్లో పాల్గొనబోయే రెండో పురుష బాక్సర్‌గా అమిత్‌ పంఘాల్‌ నిలిచాడు. ఇక ఇప్పటికే ఈ మెగా ఈవెంట్‌కు నిషాంత్‌ దేవ్‌ 71 కేజీల విభాగంలో అర్హత సాధించిన విషయం తెలిసిందే. మరోవైపు మహిళా బాక్సర్లు నిఖత్‌ జరీన్‌ 50 కేజీలు, ప్రీతి పవార్‌ 54 కేజీలు, లవ్లీనా బొర్గొహెయిన్‌ 74 కేజీలు ఒలింపిక్‌ బెర్తులు ఖరారు చేసుకున్నారు.

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..