India Vs Pakistan T20 World Cup 2024 Match Threat By Terror Attack From ISIS
స్పోర్ట్స్

Team India: మ్యాచ్‌ ముప్పు, అధికారులు అప్రమత్తం 

India Vs Pakistan T20 World Cup 2024 Match Threat By Terror Attack From ISIS: జూన్ 9న టీ20 వరల్డ్ కప్‌లో చిరకాల ప్రత్యర్థులు అయినటువంటి భారత్, పాకిస్థాన్ మధ్య హై ప్రొఫైల్ మ్యాచ్ జరగబోతోంది. ఈ మ్యాచ్‌కు ముందు న్యూయార్క్‌లోని లాంగ్ ఐలాండ్‌లోని నాసావు కౌంటీ క్రికెట్ స్టేడియంకి భారత్‌ టీమ్‌ చేరుకుంది. వీరి భద్రతకు సంబంధించి చాలా మందిలో ఆందోళనలు స్టార్ట్‌ అయ్యాయి.

ఎందుకంటే ఈ మ్యాచ్‌లో ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని పలు రకాల వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో భద్రతా సిబ్బంది భద్రతని పెంచేందుకు పూర్తిస్థాయిలో దానికి తగ్గట్టుగా సన్నాహాలు చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు విస్తృతంగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ మ్యాచ్‌కు పూర్తిస్థాయిలో పోలీసుల బందోబస్తుని పెంచేందుకు అన్నిరకాల అధికారులను అప్రమత్తం చేసి ఆటగాళ్లకి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Also Read: అంబటికి బెదిరింపులు, ఎవరంటే..?

అంతేకాకుండా వీటన్నింటిని ఎదుర్కొనేందుకు పలురకాల సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. విమానాశ్రయాలను జల్లెడ పడుతున్నారు. అనుమానస్పదంగా ఎవరు కనిపించిన వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. దీంతో క్రీడాకారుల కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. నివేదికల ప్రకారం ఐఎస్‌ఐఎస్‌ ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ లోన్ వోల్ఫ్ దాడి గురించి కీలక ప్రకటన చేసింది. దీనిపై ఐఎస్‌ఐఎస్ ఒక వీడియోని రిలీజ్‌ చేసింది. మ్యాచ్‌కు అంతరాయం కలిగిస్తామని ప్రకటించింది. ఈ మొత్తం విషయానికి సంబంధించి, నసావు కౌంటీ పోలీసు కమిషనర్ ప్యాట్రిక్ రైడర్ ముప్పును ధృవీకరించారు. అలాగే, భద్రతా చర్యల గురించి వివరించారు.

Just In

01

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు