India 2nd Odi Harmanpreet Kaur Smashed 103 Runs 88 Balls Scores
స్పోర్ట్స్

Indian Womens: ఆకాశమే హద్దుగా… 

India 2nd Odi Harmanpreet Kaur Smashed 103 Runs 88 Balls Scores:దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమిండియా మహిళా బ్యాటర్లు సొంతగడ్డపై విరుచుకుపడ్డారు. మెయిన్‌గా వైస్‌ కెప్టెన్‌ స్మృతి మంధన, కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. ఈ సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి వన్డేలో సెంచరీ సాధించిన మంధన, జూన్‌ 19 జరుగుతున్న రెండో వన్డేలోనూ వీర బాధుడు బాదింది.

ఈ మ్యాచ్‌లో వైస్‌ కెప్టెన్‌ మంధన మెరుపు శతకంతో విరుచుకుపడితే కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సుడిగాలి సెంచరీతో అభిమానులను అలరించింది. కెప్టెన్‌, వైస్‌ కెప్టెన్లు ఇద్దరూ సెంచరీలతో కదం తొక్కడంతో ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌, నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 325 రన్స్‌తో భారీ స్కోర్‌ చేసింది. భారత్‌ ఇన్నింగ్స్‌లో మంధన, హర్మన్‌ సెంచరీలతో విజృంభించగా షఫాలీ వర్మ , దయాలన్‌ హేమలత, రిచా ఘోష్‌ ఓ మోస్తరు స్కోర్లు చేశారు.

Also Read:అదరగొట్టిన అర్జున్

సౌతాఫ్రికా బౌలర్లలో మ్లాబా 2, క్లాస్‌ ఓ వికెట్‌ పడగొట్టారు. 49వ ఓవర్‌ 2వ బంతి ఎదుర్కొనే టైమ్‌కి 85 బంతుల్లో 88 రన్స్‌ చేసిన హర్మన్‌ ఆ తర్వాత మూడు బంతులను వరుసగా బాది సెంచరీ పూర్తి చేసుకుంది. వన్డేల్లో హర్మన్‌కు ఇది 6వ సెంచరీ. టీమిండియా తరఫున అత్యధిక వన్డే సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో హర్మన్‌ మూడో స్థానంలో నిలిచింది. ఇదే మ్యాచ్‌లో సెంచరీ చేసిన మంధన భారత్‌ తరఫున అత్యధిక వన్డే సెంచరీలు చేసిన మిథాలీ రాజ్‌ రికార్డును సమం చేసింది.

Just In

01

Director Krish: ‘హరి హర వీరమల్లు’ విషయంలో చాలా బాధగా ఉంది

Kalvakuntla Kavitha: దూకుడు పెంచిన కవిత.. జాగృతిలో భారీగా చేరికలు.. నెక్ట్స్ టార్గెట్ బీసీ రిజర్వేషన్లు!

CV Anand: ప్రతీ పెద్ద పండుగ పోలీసులకు సవాలే .. హైదరాబాద్ సీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు