NZ vs BAN: ఛాంపియన్ ట్రోఫీ 2025 లో ( ICC Champions Trophy 2025 ) భాగంగా… ఇవాళ బంగ్లాదేశ్, న్యూజిలాండ్ ల ( Bangladesh vs New Zealand ) మధ్య జరుగుతున్న కీలక మ్యాచ్ ప్రారంభమైంది. తొలుత టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంటర్ బౌలింగ్ ను ఎంచుకున్నారు. గ్రూప్ ఎ లో ఉన్న ఈ రెండు జట్ల మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్.
ఇప్పటికే న్యూజిలాండ్… ఈ టోర్నీలో విజయం సాధించి ఊపు మీదుంది. బంగ్లాదేశ్ మాత్రం టీమిండియా చేతిలో ఓడిపోయింది. అటు పాకిస్థాన్ ను చిత్తు చేసిన న్యూజిలాండ్… ఇవాళ మ్యాచ్ లో గెలిచి సెమీఫైనల్ కి వెళ్లాలని అన్ని రకాల ప్రయత్నిస్తోంది. మరోవైపు బంగ్లాకు ఈ మ్యాచ్ చావో రేవో కావడంతో… ఇందులో ఎలాగైనా గెలిచి… సెమిస్ బరిలో ఉండాలని ప్రయత్నిస్తోంది.
అయితే, తొలుత టాస్ గెలిచిన జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంటుందని అందరూ భావించారు కానీ అందుకు భిన్నంగా న్యూజిలాండ్ బౌలింగ్ ను ఎంచుకుంది. సో.. ఏం జరుగుతుందో చూడాలి మరి!
Also Read:
Ind vs Pak: రోహిత్ శర్మ వరల్డ్ రికార్డు.. 9 వేల పరుగులు పూర్తి