afg-vs-sa
స్పోర్ట్స్

AFG VS SA: గ్రూప్ ‘బి’లో తొలి మ్యాచ్… తలపడనున్న సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్

ఛాంపియన్స్ ట్రోఫీలో నేటి నుంచి గ్రూప్-బి మ్యాచ్‌లు మొదలవుతున్నాయి. అందులో భాగంగా ఇవాళ సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడనున్నాయి. నేషనల్ స్టేడియం కరాచీలో మద్యాహ్నం 2.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 19న మొదలైన ఈ ట్రోఫీలో తొలి రెండు రోజులు గ్రూప్-ఏలోని జట్ల మధ్య మ్యాచ్ లు జరిగాయి. తొలి మ్యాచ్ పాకిస్తాన్-న్యూజిలాండ్ మధ్య జరగగా… అందులో కివీస్ విజయం సాధించింది. ఆరంభ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు అయిన పాకిస్తాన్ ను ఓడించి కివీస్ విజయం సాధించింది. దుబాయ్ వేదికగా జరిగిన బంగ్లా-భారత్ మ్యాచ్‌లో టీమిండియా గెలుపొందింది.

పసికూన అప్ఘనిస్తాన్ మెరుగైన ఆటతీరుతో ఛాంపియన్స్ ట్రోఫీలోని ఎనిమిది జట్లలో స్థానం సాధించగలిగింది. వన్డే వరల్డ్ కప్-2023, టీ20 వరల్డ్ కప్-2024లో టాప్ టీమ్స్‌ సైతం అప్ఘాన్ గడగడలాడించింది. ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా జట్టు సెమీ ఫైనల్స్‌కు చేరుతుందని క్రికెట్ పండితులు జోస్యం చెబుతున్నారు. మరి, ఏం జరుగుతుందన్నది వేచి చూడాలి.

కాగా, ఈ రెండు జట్లు ఇప్పటివరకు ఐదు వన్డేల్లో తలపడ్డాయి. అందులో మూడింటిలో సౌతాఫ్రికా విజయం సాధించింది. రెండు సార్లు ఆఫ్ఘనిస్తాన్ గెలుపొందింది. అయితే ఈ రెండు జట్ల మధ్య జరిగిన ఏకైక వన్డే సిరీస్ ను 21 తేడాతో ఆఫ్ఘనిస్తాన్ గెలుచుకుంది. ఈ నేపథ్యంలో చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న మ్యాచ్ లో ఎవరు నెగ్గుతారోనని క్రికెట్ ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

Just In

01

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!