I Waited For That Chance
స్పోర్ట్స్

SRH: ఆ ఛాన్స్‌ కోసం వెయిట్‌ చేశా..!

I Waited For That Chance: ఐపీఎల్‌ 2024 సీజన్‌లో ఛాన్స్ కోసం వెయిట్‌ చేయడం చాలా కష్టంగా అనిపించిందని సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆటగాడు రాహుల్ త్రిపాఠి వ్యాఖ్యానించాడు. ప్లేఆఫ్స్‌ మ్యాచుల్లో కీలకంగా రాణిస్తున్న అతడి నుంచి ఫైనల్‌లోనూ మరోసారి అద్భుత ఇన్నింగ్స్‌ కావాలని ఫ్యాన్స్ ఎంతగానో ఆశిస్తున్నారు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు ఆడిన త్రిపాఠి 156 రన్స్‌ చేశాడు.

అతడి స్ట్రైక్‌రేట్ 152.94. ఇందులో 17 ఫోర్లు, 6 సిక్స్‌లు ఉన్నాయి. తుది జట్టులో లేకపోయినప్పుడు కూడా.. తన అవసరం ఉన్నప్పుడు సిద్ధంగా ఉండేవాడినని తెలిపాడు. ఈ సీజన్‌లో నా ఛాన్స్‌ కోసం వేచి చూసి ఉన్నా. అది చాలా క్లిష్టతరం. నేను ఆడనప్పుడు కూడా.. జట్టుకు ఎలా సాయపడాలని ఆలోచిస్తూ ఉండేవాడిని. ఎప్పుడు ఛాన్స్‌ వస్తే అప్పుడు ఆడేందుకు సిద్ధంగా ఉన్నా. అందుకు తీవ్రంగా శ్రమించేవాడినని, అదే నన్ను ఈ సీజన్‌లో ముందుండి నడిపిస్తోందని రాహుల్ తెలిపాడు. స్థానం లేకపోయినా ఎప్పుడూ నిరాశ చెందలేదు. అలానే ఉంటే ఆత్మవిశ్వాసం దెబ్బతింటుందనే నా అభిప్రాయమని త్రిపాఠి తెలిపాడు. ఐపీఎల్ 17వ సీజన్ ఫైనల్ మ్యాచ్‌ సందర్భంగా కోల్‌కతా, హైదరాబాద్‌ కెప్టెన్లు శ్రేయస్‌ అయ్యర్, పాట్ కమిన్స్ సరదాగా చెన్నై అంతా కలియదిరిగారు. వీరిద్దరూ కలిసి ఆటో రైడ్‌కు వెళ్లారు.

Also Read: ఫైనల్‌లో సింధూకి మళ్లీ నిరాశే  

ఈ సందర్భంగా డ్రైవర్‌ సీట్‌లో కూర్చున్న శ్రేయస్‌ ఆటో ఛార్జ్‌గా కమిన్స్‌కు రూ. 20 కోట్లు వేశాడు. ఎందుకంటే సన్‌రైజర్స్‌ కమిన్స్‌ను అంత పెట్టి కొనుగోలు చేసింది మరి.వన్డే ప్రపంచ కప్‌తోపాటు ఐపీఎల్‌ ట్రోఫీని గెలిచిన కెప్టెన్ల జాబితాలోకి చేరేందుకు పాట్ కమిన్స్ ఎదురు చూస్తున్నాడు. ఇంతటి ఘనత సాధించిన కెప్టెన్‌ ఎంఎస్ ధోనీ. అతడి నాయకత్వంలో భారత్ 2011 వరల్డ్‌ కప్‌ను సాధించాడు. ఐపీఎల్‌లో ఐదుసార్లు చెన్నై సూపర్ కింగ్స్‌ను ఛాంపియన్‌గా నిలిపాడు. కమిన్స్‌ కూడా గతేడాది ఆసీస్‌కు వన్డే కప్‌ అందించాడు. ఈసారి హైదరాబాద్‌ను ఫైనల్‌కు చేర్చాడు.

Just In

01

Mahabubabad District: మహబూబాబాద్‌లో కుక్కల స్వైర విహారం.. పట్టించుకోని అధికారులు

Maoist Ashanna: మావోయిస్టు ఆశన్న సంచలన వీడియో.. ఏమన్నారంటే..?

Kishan Reddy: జూబ్లీహిల్స్‌లో రౌడీయిజం పెరిగిపోయింది: కిషన్ రెడ్డి సంచన వ్యాక్యలు

Private Colleges: నవంబర్ 3 నుంచి రాష్ట్రంలో ప్రైవేట్ కాలేజీల బంద్..?

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..