Hardik Pandya Poor Captaincy 2 Bad Decisions Costs Mumbai Indians Defeat Against Gujarat Titans
స్పోర్ట్స్

IPL 2024: కొంపముంచిన పాండ్యా

Hardik Pandya Poor Captaincy 2 Bad Decisions Costs Mumbai Indians Defeat Against Gujarat Titans: ఐపీఎల్ 2024 సీజన్‌లో ముంబై ఇండియన్స్ టీమ్‌ది పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి హార్దిక్ సేన తప్పుకున్న.. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఓటమిని చవిచూసింది. వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను 16 ఓవర్లకు కుదించగా.. సమష్టిగా రాణించిన కేకేఆర్ 18 రన్స్ తేడాతో గెలుపొందింది. ఇషాన్ కిషన్‌, తిలక్ వర్మ రాణించినా ఫలితం లేకపోయింది. కీలక సమయంలో రాణించాల్సిన హార్దిక్ పాండ్యా దారుణంగా విఫలమవ్వడం ముంబై ఇండియన్స్ విజయవకాశాలను దెబ్బతీసింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 16 ఓవర్లలో 7 వికెట్లకు 157 రన్స్ చేసింది. వెంకటేశ్ అయ్యర్, నితీష్ రాణా దూకుడుగా ఆడారు. ముంబై ఇండియన్స్ బౌలర్లలో పియూష్ చావ్లా, బుమ్రా రెండేసి వికెట్లు తీయగా నువాన్ తుషారా,అన్షుల్ కంబోజ్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్య చేధనకు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 16 ఓవర్లలో 8 వికెట్లకు 139 పరుగులే చేసి ఓటమిపాలైంది. కేకేఆర్ బౌలర్లలో హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తీ, ఆండ్రీ రస్సెల్ రెండేసి వికెట్లు తీయగా సునీల్ నరైన్ ఓ వికెట్ పడగొట్టాడు. ఈ గెలుపుతో కేకేఆర్ ప్లే ఆఫ్స్ బెర్త్‌ను దక్కించుకుంది. ఈ ఏడాది ప్లే ఆఫ్స్ బెర్త్‌ను ఖరారు చేసుకున్న తొలి జట్టుగా కేకేఆర్ ఐడెంటీటీ పొందింది.

Also Read: హోరాహోరీ మ్యాచ్‌లో ఇరగదీసిన జోడీ

158 పరుగుల లక్ష్యచేధనకు దిగిన ముంబై ఇండియన్స్‌కు ఓపెనర్లు ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ శుభారంభం అందించారు. దూకుడుగా ఆడుతూ వేగంగా రన్స్‌ చేశారు. దాంతో ముంబై పవర్ ప్లేలోనే వికెట్ నష్టపోకుండా 59 రన్స్‌ చేసింది. అనంతరం శ్రేయస్ అయ్యర్ స్పిన్నర్లను రంగంలోకి దింపగా ఓపెనర్లు ఇద్దరిని వరస ఓవర్లలో పెవిలియన్ చేర్చారు.హాఫ్ సెంచరీకి చేరువైన ఇషాన్ కిషన్‌ను నరైన్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. ఆ వెంటనే రోహిత్ శర్మ ‌ను వరుణ్ చక్రవర్తీ ఔట్ చేశాడు. క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్‌ను ఆండ్రీ రస్సెల్ వెనక్కి పంపాడు. దాంతో 87 పరుగులకే ముంబై మూడు వికెట్లు కోల్పోయింది. హార్దిక్ పాండ్యా, టీమ్ డేవిడ్, నెహాల్ వధేరా విఫలమవ్వగా, తిలక్ వర్మ ఒంటరి పోరాటం చేశాడు. దూకుడుగా ఆడిన నమన్ ధిర్,తిలక్ వర్మను హర్షిత్ రాణా ఒకే ఓవర్‌లో ఔట్ చేసి కేకేఆర్ విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!