Hardik Pandya Goes Past MS Dhoni Achieve T20 Worldcup Record India
స్పోర్ట్స్

Sports News: రికార్డు బద్దలు

Hardik Pandya Goes Past MS Dhoni Achieve T20 Worldcup Record India:టీ20 వరల్డ్‌కప్‌ 2024లో టీమిండియా వైస్ కెప్టెన్‌ హార్థిక్‌ పాండ్యా సత్తా చాటుకున్నాడు.తన ఆల్‌రౌండర్‌ ప్రదర్శనతో భారత జట్టుకు అద్భుతమైన విజయాలు అందిస్తున్నాడు. తాజాగా ఈ మెగా టోర్నీ సూపర్‌-8లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాండ్యా ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టాడు. బ్యాటింగ్‌లో ఆజేయ అర్ధశతకం సాధించిన పాండ్యా బౌలింగ్‌లో ఓ కీలక వికెట్‌ పడగొట్టాడు. ఈ క్రమంలో హార్దిక్‌ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నారు.

టీ20 ప్రపంచకప్ చరిత్రలో 300 రన్స్ 20 వికెట్లు సాధించిన తొలి భారత క్రికెటర్‌గా హార్ధిక్‌ రికార్డులెక్కాడు.
టీ20 వరల్డ్‌కప్‌లో ఇప్పటివరకు 21 మ్యాచ్‌లు ఆడిన హార్ధిక్‌ 302 పరుగులు చేశాడు. అటు బౌలింగ్‌లోనూ 21 వికెట్లు పడగొట్టాడు. ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన జాబితాలో పాండ్యా ఐదో స్థానంలో నిలిచాడు. అంతేకాదు టీ20 వరల్డ్‌కప్‌లో ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి అత్యధిక స్కోర్‌ సాధించిన తొలి భారత ప్లేయర్‌గా పాండ్యా రికార్డు సృష్టించాడు.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!