Gautam Gambhir Finally Breaks Silence On Coaching India
స్పోర్ట్స్

Indian Coach: కోచ్‌పై గౌతమ్‌ గంభీర్‌ క్లారిటీ

Gautam Gambhir Finally Breaks Silence On Coaching India: టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ముగిసాక రాహుల్ ద్రావిడ్ హెడ్‌ కోచ్ ప‌ద‌వి నుండి త‌ప్పుకోనున్నారు. అయితే త‌దుప‌రి హెడ్ కోచ్‌గా ఎవ‌రు వ‌స్తారనే సందేహం అంద‌రిలో నెలకొంది. గౌతమ్ గంభీర్ మెంటార్‌గా వ్యవహరించిన కేకేఆర్ ఈ ఏడాది ఐపీఎల్‍లో అద్భుతంగా ఆడి టైటిల్ సాధించ‌డంతో గంభీర్‌ని హెడ్ కోచ్‌గా నియ‌మిస్తే బాగుంటుంద‌ని చాలామంది త‌మ అభిప్రాయం వ్య‌క్తం చేశారు. బీసీసీఐ కూడా ఆ దిశ‌గా అడుగులు వేస్తున్న‌ట్టుగా క‌నిపిస్తుంద‌నే టాక్ కూడా న‌డిచింది.

అయితే ఈ విష‌యంలో గంభీర్ అభిప్రాయం ఏంటి, అత‌ను టీమిండియా హెడ్ కోచ్‌గా ఉండేందుకు ఇంట్రెస్ట్‌ చూపుతున్నాడా లేదా అనే విష‌యంలో క్లారిటీ వ‌చ్చింది. టీమిండియాకు కోచ్‍గా ఉండేందుకు తాను ఇష్టపడతానని గౌతమ్ గంభీర్ చెప్పాడు. జాతీయ జట్టుకు కోచ్‍గా ఉండడం కంటే పెద్ద గౌరవం ఇంకేమి ఉండ‌ద‌ని ఓ ప్రోగ్రాంలో తెలియ‌జేశాడు. భార‌త జ‌ట్టు టీ20 ప్ర‌పంచక‌ప్ త‌ప్పకుండా గెలుస్తుంది. కాక‌పోతే భ‌యం లేకుండా ఆడాల్సి ఉంటుంద‌ని గౌతీ తెలియ‌జేశాడు. టీమిండియాకు కోచ్‍గా ఉండాలనుకుంటున్నారా, ప్రపంచకప్ గెలిచేందుకు ఎలా హెల్ప్ చేస్తారని ఎదురైన ప్రశ్నకు గంభీర్ రియాక్ట్ ఎలా ఉందంటే టీమిండియాకు కోచ్‍గా ఉండడాన్ని నేను ఇష్టపడతా. జాతీయ జట్టుకు కోచింగ్ చేయడం కంటే మరే పెద్ద గౌరవం ఉండదని గౌతమ్ గంభీర్ అన్నాడు.

Also Read:విడాకులు అనుకుంటే, బిగ్ షాక్‌ ఇచ్చిన నటాషా

ఒక‌వేళ గంభీర్ టీమిండియాకి హెడ్ కోచ్‌గా ఉంటే కేకేఆర్‌కి మెంటార్‌గా ఉండే ఛాన్స్ ఉండ‌దు. టీమిండియా కొత్త కోచ్ 2027 డిసెంబర్ 31 వరకు బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉండ‌గా, గంభీర్ హెడ్ కోచ్ అయితే కేకేఆర్‌కు గంభీర్ 2027 వరకు గుడ్ బై చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే బీసీసీఐ నిబంధనల ప్రకారం భారత జట్టు కోచ్ ఏ ఫ్రాంచైజీకి సేవలు అందించరాదు. సీఎస్‌కే, ముంబై ఇండియన్స్ తర్వాత అత్యధిక టైటిళ్లు సాధించిన జట్టు కోల్‌కతానే. సీఎస్‌కే, ముంబై చెరో ఐదు ట్రోఫీలు సాధించగా కేకేఆర్ మూడుసార్లు విజేతగా నిలిచింది. 2012,2014లో గంభీర్ సారథ్యంలో ఛాంపియన్‌గా నిలిచింది. 2024లో గంభీర్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో కేకేఆర్ జ‌ట్టు అద్భుతంగా ఆడి ట్రోఫీ గెలిచింది.

Just In

01

Turakapalem Village: ఎవరూ వంట చేసుకోవద్దు.. కనీసం నీళ్లూ తాగొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు