Ganguly Advice To Bcci on Team India New Coach For Rahul Dravid Replacement
స్పోర్ట్స్

Head Coach: హెడ్‌కోచ్‌ ఎంపికపై గంగూలీ సంచలన వ్యాఖ్యలు..!

Ganguly Advice To Bcci on Team India New Coach For Rahul Dravid Replacement: టీమిండియా నెక్స్ట్‌ హెడ్‌ కోచ్‌‌ను ఎంపిక చేసే విషయంలో కాస్త ఆలోచించి ముందడుగు వేయాలని బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఒక ఆటగాడి జీవితంలో కోచ్ పదవి చాలా కీలకమైంది. హెడ్ కోచ్ అనేవారు మెంటార్‌గా, కనికరం లేని శిక్షణతో ఆటగాళ్లను అత్యుత్తమ ఆటగాళ్లుగా తీర్చిదిద్దాల్సి ఉంటుంది. వ్యక్తిత్వపరంగానూ ఫ్లేయర్స్‌ను మార్చాల్సిన అవసరం ఉంటుంది.

కోచ్ పదవి కోసం ఎంపిక చేసేటప్పుడు కాస్త తెలివిని ప్రదర్శించాలని గంగూలీ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవి కాలం టీ20 ప్రపంచకప్‌ 2024తో ముగియనుంది. ఈ లోగా బీసీసీఐ కొత్త కోచ్ ఎంపికను పూర్తి చేసి జూలై 1 నుంచి బాధ్యతలు అప్పగించాల్సి ఉంటుంది. ఇప్పటికే బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించింది. గత సోమవారంతోనే దరఖాస్తుల గడువు ముగిసింది. టీమిండియా తదుపరి హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ నియామకం పూర్తయినట్లు వార్తలు వచ్చాయి. కానీ గంభీర్ మాత్రం తాను కేకేఆర్ మెంటార్‌గానే కొనసాగనున్నట్లు క్లారిటీ ఇచ్చాడు. దాంతో ఆశిష్ నెహ్రాతో పాటు విదేశీ కోచ్‌లు టీమిండియా హెడ్ కోచ్ పదవి బాధ్యతలు చేపట్టేందుకు ఇంట్రెస్ట్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సౌరవ్ గంగూలీ తెలివిని ప్రదర్శించాలని ట్వీట్ చేయడం చర్చనీయాంశమైంది.

Also Read:మ్యాచ్‌ ముప్పు, అధికారులు అప్రమత్తం

గౌతమ్ గంభీర్‌‌ను నియమించారనే వార్తలతోనే గంగూలీ ఈ ట్వీట్ చేశాడనే ప్రచారం జోరుగా సాగుతోంది. గంభీర్‌ను టీమిండియా హెడ్ కోచ్‌గా ఎంపిక చేయడంపై మాజీ క్రికెటర్లు వ్యతిరేకిస్తున్నారు. హర్భజన్ సింగ్ సైతం ఇదే తరహా ఒపీనియన్‌ని రివీల్‌ చేశాడు. ఆశిష్ నెహ్రాను తదుపరి హెడ్ కోచ్‌గా నియమించాలని చెప్పాడు. టీమిండియా హెడ్ కోచ్ పదవి కోసం బీసీసీఐకి ఇప్పటికే 3వేల అప్లికేషన్స్ వచ్చాయి. ఇందులో చాలావరకు ఫేక్ అప్లికేషన్స్ ఉన్నాయని జాతీయ మీడియా పేర్కొంది. ఇందులో ప్రముఖులు అయినటువంటి భారత ప్రధాని మోదీతో పాటు సన్నీలియోన్, సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోనీ పేరిట ఫేక్ అప్లికేషన్స్ వచ్చాయని బీసీసీఐ వెల్లడించింది. అంతేకాకుండా అందులోని ప్రముఖులు సైతం షాక్‌ అయ్యేలా చేసింది.

Just In

01

Chamal Kiran Kumar: ఉద్యోగాల్లో కృత్రిమ మేధస్సు కీ రోల్.. ఎంపీ చామల కీలక వ్యాఖ్యలు

Peddi Update: రత్నవేలు ఇచ్చిన అప్డేట్‌తో రామ్ చరణ్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ!

Harish Rao: కవిత వ్యాఖ్యలపై.. తొలిసారి స్పందించిన హరీశ్‌ రావు

Srinivas Goud: వైన్స్ షాపుల్లో గౌడ్లకు 25శాతం ఇవ్వాల్సిందే… మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?