Former Indian Player Advises Not To Over Do It
స్పోర్ట్స్

Sports News: అతి చేయవద్దని సూచించిన భారత మాజీ ఆటగాడు

Former Indian Player Advises Not To Over Do It: ఐపీఎల్ 17వ సీజన్‌ ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఈసారి కప్ మనదే అంటూ వచ్చిన ఆర్‌సీబీకి మళ్లీ చుక్కెదురైంది. రాజస్థాన్‌ అద్భుత విజయంతో రెండో క్వాలిఫయర్‌కు దూసుకెళ్లింది. వరుసగా ఆరు విజయాలు సాధించి అనూహ్య రీతిలో ప్లేఆఫ్స్‌కు చేరిన బెంగళూరు ఎలిమినేటర్‌లో ఓడిపోయింది. నాకౌట్‌కు చేరుకొనేందుకు తన చివరి లీగ్‌ మ్యాచ్‌లో చెన్నైపై గెలిచింది.

ఈ సందర్భంగా సంబరాలు చేసుకుంటూ సీఎస్‌కే ఆటగాళ్లకు కరచాలనం చేసేందుకు ఆర్‌సీబీ ప్లేయర్లు టైమ్‌ తీసుకున్నారు. దీనిపై చాలా ఆటగాళ్ల నుండి తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఓడిపోవడంతో ఆ జట్టు నెట్టింట ట్రోలింగ్‌కు గురైంది. ఈ క్రమంలో భారత మాజీ ఆటగాడు కృష్ణమాచారి శ్రీకాంత్ కీలక సూచనలు చేశాడు. ఒక మ్యాచ్‌ గెలవగానే అతిగా సంబరాలు చేసుకోవాల్సిన పనిలేదని వ్యాఖ్యానించాడు. జీవితంలో మీరు ఏదైనా సాధిస్తే నోరును అదుపులో పెట్టుకొని ముందుకు సాగిపోవాలి తప్పా.. మీరు ఎప్పుడైతే అనవసరంగా గోల చేస్తారో ఇక అక్కడ నుంచి పైకి వెళ్లలేరని తెలిపారు. సీఎస్‌కేపై విజయం సాధించిన తర్వాత ఆర్‌సీబీ ఫ్యాన్స్ తమ జట్టు టాలెంట్‌ని తెలిపేందుకు చాలా వీడియోలు పోస్టు చేశారు.

Also Read:ప్రపంచ రికార్డు సాధించిన భారత క్రీడాకారిణి

ఇప్పుడు అవే వారికి తిరిగి వచ్చాయి. క్రికెట్‌లో అతిగా సంబరాలు చేసుకోవడం ఎప్పటికీ మంచిది కాదని సూచించారు. మీరు బాగా ఆడితే కంగ్రాట్స్‌ చెబుతారు. చెత్తగా ఆడితే మాత్రం విమర్శలు చేస్తారని అన్నారు. ఆ టైంలో నోరు మూసుకొని దూకుడుని తగ్గించుకోవాలి. అద్భుతంగా కమ్‌బ్యాక్‌ చేసి నాకౌట్‌కు చేరుకున్నందుకు వారిని వారు అభినందించుకోవడం మంచిదే. కానీ, సీఎస్‌కే, ముంబయి వంటి జట్లు ఇలా చాలాసార్లు చేసి చూపించాయి. వరుసగా ఆరు మ్యాచ్‌లు గెలిచిన ఆర్‌సీబీ ప్లేఆఫ్స్‌లో మాత్రం ఓటమిని చవిచూసిందని వ్యాఖ్యానించాడు.

Just In

01

CM Revanth Reddy: సంక్షేమ నిధికి రూ.10 కోట్లు.. సినీ కార్మికులకు సీఎం రేవంత్ రెడ్డి వరాలు

Seethakka: జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ గెలిస్తే.. వెయ్యి కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తాం : మంత్రి సీతక్క

Zoho Payments: ‘జోహో పే’ వచ్చేస్తోంది.. గూగుల్ పే, ఫోన్‌పే యూజర్లు ఎటువైపు మొగ్గుతారో?.. ఫీచర్లు ఇవే

Seethakka: అంగ‌న్వాడీ నియామకాల ప్ర‌క్రియ వేగ‌వంతం చేయాలి.. అధికారులకు మంత్రి సీతక్కఆదేశం!

Dacoit: అడవి శేష్ ‘డకాయిట్’ రిలీజ్ డేట్ మారింది.. ఇక వచ్చే సంవత్సరమే!