Ipl History Sai Sudarshan Shubman Gill Are The First Opening Pair To Score Centuries Together
స్పోర్ట్స్

IPL 2024: హోరాహోరీ మ్యాచ్‌లో ఇరగదీసిన జోడీ

Ipl History Sai Sudarshan Shubman Gill Are The First Opening Pair To Score Centuries Together: 2024 ఐపీఎల్ 59వ మ్యాచ్‌లో గుజ‌రాత్ టైటాన్స్, చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్లు హోరాహోరీగా త‌ల‌ప‌డ్దాయి. చెన్నై సూప‌ర్ కింగ్స్ బౌలింగ్‌ను చీల్చి చెండాడుతూ గుజ‌రాత్ ఓపెన‌ర్లు శుభ్‌మ‌న్ గిల్, సాయి సుద‌ర్శ‌న్‌లు ఫోర్లు, సిక్స‌ర్లు బాదారు. ధ‌నాధ‌న్ బ్యాటింగ్‌తో ప‌రుగుల సునామీని సృష్టించారు. ఈ క్ర‌మంలోనే గిల్, సాయి సుద‌ర్శ‌న్‌లు సెంచ‌రీలు సాధించారు.

దీంతో గుజ‌రాత్ జ‌ట్టు 20 ఓవ‌ర్ల‌లో 231 రన్స్‌ చేసింది. 232 రన్స్‌ భారీ టార్గెట్‌తో బ‌రిలోకి దిగిన చెన్నై సూప‌ర్ కింగ్స్ 35 రన్స్ తేడాతో ఓట‌మి పాలైంది. అయితే, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజ‌రాత్‌కు శుభ్‌మ‌న్ గిల్, సాయి సుద‌ర్శ‌న్‌లు భారీ స్కోర్‌ను అందించారు. ఫోర్లు, సిక్స‌ర్లు బాదుతూ స్టేడియాన్ని హోరెత్తించారు. ఈ ఇద్ద‌రు ప్లేయ‌ర్లు 50 బంతుల్లో సెంచ‌రీలు సాధించారు. 103 ప‌రుగుల త‌న ఇన్నింగ్స్‌లో సాయి సుద‌ర్శ‌న్ 5 ఫోర్లు, 7 సిక్స‌ర్లు బాదాడు. గిల్ 9 ఫోర్లు, 6 సిక్స‌ర్ల‌తో 104 ప‌రుగుల ఇన్నింగ్స్‌తో మెరిశాడు. దీంతో 20 ఓవ‌ర్ల‌లో గుజ‌రాత్ 231 ప‌రుగులు సాధించింది.

Also Read: పెళ్లి కాకుండానే తండ్రైన క్రికెట్‌ ఆటగాడు 

అయితే ఐపీఎల్ చ‌రిత్ర‌లో గిల్, సాయి సుద‌ర్శ‌న్‌లు స‌రికొత్త రికార్డు సృష్టించారు. ఒకే మ్యాచ్‌లో వ్యక్తిగత సెంచరీలు చేసిన తొలి ఓపెనింగ్ జోడీగా వీరు ఘ‌న‌త సాధించారు. ఓపెనింగ్ బ్యాట్స్ మెన్లు ఇద్దరూ ఒకేసారి సెంచరీలు చేయడం ఐపీఎల్ హిస్టరీలో ఇదే తొలిసారి. బెయిర్ స్టో ఔటైన తర్వాత వార్నర్ సెంచరీ సాధించడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ అంత‌కుముందు ఈ ఘ‌న‌త సాధించింది. జానీ బెయిర్ స్టో, డేవిడ్ వార్నర్‌లు ఈ మైలురాయిని అందుకున్న తొలి ఓపెనింగ్ జోడీగా నిలిచారు. వారి త‌ర్వాత ఇప్పుడు గిల్, సాయిలు ఒకేసారి సెంచ‌రీలు సాధించి చ‌రిత్ర సృష్టించారు. 2022లో కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎల్ఎస్జీ ఓపెనర్లు క్వింటన్ డికాక్, కేఎల్ రాహుల్ భాగస్వామ్య రికార్డును సమం చేసింది ఈ జోడీ.

Just In

01

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు

Proddatur Dasara: దాగి ఉన్న చరిత్రను చెప్పే కథే ఈ ‘ప్రొద్దుటూరు దసరా’.. ఆ రోజు మాత్రం!

Gadwal: గద్వాల నడిబొడ్డున ఎండోమెంట్ ఖాళీ స్థలం కబ్జా.. దర్జాగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం

Crime News: దుస్తులు లేకుండా వచ్చి.. ఒక మహిళను ఈడ్చుకెళుతున్నారు.. యూపీలో ‘న్యూడ్ గ్యాంగ్’ కలకలం

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?