Defeat Because Of That Decision Alone
స్పోర్ట్స్

IPL 2024: కేవలం ఆ నిర్ణయం వల్లే ఓటమి..! 

Defeat Because Of That Decision Alone: మరోసారి ఆర్‌ఆర్‌ టీమ్‌కి హార్ట్ బ్రేక్ అయ్యింది. వరుసగా 16 సీజన్లను ట్రోఫీ సాధించకుండానే ముగించింది. ఐపీఎల్ స్టార్టింగ్ సీజన్‌లో ఆర్‌ఆర్ టైటిల్ గెలిచింది. ఆ తర్వాత మరోసారి విజేతగా నిలవలేకపోయింది. అయితే ఐపీఎల్ 2024 సీజన్‌ను ఘనంగా ఆరంభించింది. హాఫ్ సీజన్ ముగిసేసరికి టేబుల్ టాప్‌లో ఉంది. కానీ లీగ్ దశను పేలవంగా ఎండ్‌ చేసింది. చివరి అయిదు మ్యాచ్‌ల్లో ఒక్క విజయం కూడా సాధించలేకపోయింది.

అందులో ఓ మ్యాచ్ రద్దు అయ్యింది. అయితే కీలక ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆర్‌సీబీపై గెలిచి క్వాలిఫయిర్2కు చేరుకుంది. కానీ ఈ పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో 36 రన్స్‌ తేడాతో ఓటమిని చవి చూసింది. మందకొడి పిచ్‌పై తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 175 రన్స్‌ సాధించింది. హెన్రిచ్ క్లాసెన్ అర్ధశతకంతో సత్తాచాటాడు. రాహుల్ త్రిపాఠి, ట్రావిస్ హెడ్ ఫర్వాలేదనిపించారు. రాజస్థాన్ బౌలర్లలో అవేశ్ ఖాన్, ట్రెంట్ బౌల్ట్ చెరో మూడు, సందీప్ శర్మ రెండు వికెట్లు తీశారు.ఛేదనలో ఆర్‌ఆర్‌ 20 ఓవర్లలో ఏడు వికెట్లను కోల్పోయి 139 రన్స్‌కే పరిమితమైంది. ధ్రువ్ జురెల్, యశస్వీ జైస్వాల్ పోరాడారు. ఎడమచేతి వాటం స్పిన్నర్లు షాబాజ్ అహ్మద్ మూడు, అభిషేక్ శర్మ రెండు వికెట్లతో రాజస్థాన్‌ను చిత్తుచేశారు.

Also Read: కరెక్ట్‌ టైమ్‌లో కరెక్ట్‌ డెసీషన్‌

అయితే రాజస్థాన్ ఓటమికి పేలవ ప్రణాళికలే కారణమని మాజీ క్రికెటర్లు సెహ్వాగ్, టామ్ మూడీ అన్నారు. హెట్‌మెయిర్‌ను బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందు పంపించకపోవడమే రాజస్థాన్ ఓటమికి ప్రధాన రీజన్‌ అని తెలిపారు. లెఫ్ట్ఆర్మ్ స్పిన్నర్లకు హెట్‌మెయిర్ కౌంటర్ ఎటాక్ ఇస్తూ బ్యాటింగ్ చేసే వాడని, దీంతో మ్యాచ్ మలుపు తిరిగేదని మాజీలు అభిప్రాయపడ్డారు. హెట్‌మెయిర్‌ను ఆలస్యం బరిలోకి దించడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. అతన్ని ముందుగా బ్యాటింగ్‌కు పంపించాల్సింది. ఎందుకంటే ఎస్‌ఆర్‌హెచ్ దగ్గర ఇద్దరు ఎడమచేతివాటం స్పిన్నర్లు ఉన్నారు. ఆ టైంలో దూకుడుగా ఆడే లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్ క్రీజులోకి వస్తే మ్యాచ్ మరోలా ఉండేదని సెహ్వాగ్ అన్నాడు.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!