Cricket Player Irfan Pathan Made Comments On Kohli: స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లిపై టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసల జల్లు కురింపించాడు. పుష్కరకాలం నుంచి రికార్డులు బద్దలు కొడుతున్న విరాట్ కోహ్లి తన ఆటను మరింత మెరుగుపర్చుకోవడం కోసం ఇప్పటికీ ప్రయత్నిస్తూనే ఉన్నాడని ఇర్ఫాన్ అన్నాడు. ఆటపై తనకున్న ఈ తపనే ప్రపంచ అత్యుత్తమ క్రికెటర్లలో ఒకరిగా తీర్చిదిద్దిందని కొనియాడాడు.
ఐపీఎల్ 2024 సీజన్‌లో అత్యధిక రన్స్ చేసిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లి అగ్రస్థానంలో కొనసాగుతూ ఆరెంజ్ క్యాప్‌ను ధరించాడు. 13 మ్యాచ్‌ల్లో 66 సగటుతో 661 రన్స్ చేశాడు. 155 స్ట్రైక్ రేటుతో రన్స్ సాధిస్తున్నాడు. అయితే గత కొన్ని రోజులకు ముందు కోహ్లి స్ట్రైక్‌రేటుపై మాజీ క్రికెటర్లు తీవ్ర విమర్శలు చేశారు. పవర్‌ప్లే అనంతరం కోహ్లి ఆట స్లోగా మారుతుందని, స్పిన్‌లో వేగంగా రన్స్ సాధించలేకపోతున్నాడని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సహా మరికొందరు మాజీలు కామెంట్లు చేశారు. ఈ విమర్శలకు కోహ్లి బ్యాటుతో పాటు నోటితోనూ బదులిచ్చాడు.
Also Read: ధోనీపై సంచలన వ్యాఖ్యలు చేసిన అంబటి
కామెంటరీ బాక్స్‌లో కూర్చోవడం, బరిలోకి దిగి పరిస్థితులకు తగ్గట్లుగా ఆడటం ఒక్కటి కాదని అన్నాడు. క్వాంటీటీ కంటే క్వాలిటీని ఇష్టపడతానని కోహ్లి ఘూటుగా రిప్లై ఇచ్చాడు. అంతేగాక ఆ తర్వాత నుంచి స్పిన్‌లో సిక్సర్లు, బౌండరీలు బాదుతూ హోరెత్తిస్తున్నాడు. దూకుడుగా పరుగులు చేస్తూ విమర్శకులకు సమాధానమిస్తున్నాడు. దీనిపై తాజాగా ఇర్ఫాన్ పఠాన్ స్పందించాడు. అందుకే కోహ్లి ప్రపంచ అత్యుత్తమ క్రికెటర్లలో ఒకరిగా నేను భావిస్తున్నా. ఎన్నో ఏళ్లు గడుస్తున్నా తన ఆటను మరింత మెరుగుపర్చుకుంటూనే ఉన్నాడు. గతంలో అతను స్వీప్ షాట్ ఆడలేదు. అయితే కోహ్లి స్వీప్ షాట్ ఆడడని, అందుకే స్పిన్‌లో స్టంప్స్, ప్యాడ్‌కు వచ్చే బంతులు ఎడ్జ్ తీసుకుంటాయని ప్రజలు విమర్శించారు. ఆ తర్వాత కోహ్లి ఏం చేశాడు? ముందుకు వచ్చి స్లాగ్ స్వీప్, నార్మల్ స్వీప్ షాట్లు ఆడుతూ స్ట్రైక్‌రేటును పెంచుకున్నాడని పఠాన్ అన్నాడు.