Cricket History Repeats Itself With Centuries
స్పోర్ట్స్

Srilanka Cricket Player: సెంచరీలతో క్రికెట్ హిస్టరీ రిపీట్

Cricket History Repeats Itself With Centuries : క్రికెట్‌ ప్రపంచం అనగానే మనందరికి గుర్తుకువచ్చేది ఆటలో ఉండాల్సిన వస్తువులు.. బ్యాట్‌, సేప్‌టీ, బాల్‌, పిచ్‌, ప్లేయర్స్. కానీ.. ఇక్కడ మెయిన్‌గా చెప్పుకోవాల్సింది ప్లేయర్‌ గురించి ఓ ప్లేయర్‌ ఆటకి ప్రపంచం అంతా తన వైపు చూసేలా చేశాడు. ఇక శ్రీలంక విషయానికొస్తే.. ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే..శ్రీలంక క్రికెట్ జట్టు ఏం చేసినా సెన్సేషనల్‌ అవుతూ ఉంటుంది. 2023 వరల్డ్ కప్ ఘోర ఓటమితో ఐసీసీ వేటుకి బలై సంచలనం సృష్టించింది. తాజాగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో శ్రీలంక బ్యాటర్ కమిందు మెండిస్ అరుదైన సరికొత్త రికార్డును నెలకొల్పాడు. టెస్ట్ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీల మోత మోగించి హౌరా అనిపించాడు.

అయితే తను ఏడో నెంబర్ బ్యాటర్‌గా వెళ్లి మొదటి ఇన్నింగ్స్‌లో సెంచరీ, రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ చేశాడు. ఇలా 7 నెంబర్‌లో వెళ్లి చేయడమే ఇప్పుడు క్రికెట్ ప్రపంచ చరిత్రలో హాట్‌ టాఫిక్‌గా మారింది. 147 ఏళ్ల క్రికెట్ చరిత్రలో ఇంతవరకు ఎవరూ అలా సెంచరీలు చేయకపోవడంతో రికార్డ్‌గా నిలిచింది. కమిందు రెండు సెంచరీలు మెండిస్ చేస్తే, ధనంజయ డిసిల్వా చేయడం విశేషం.

Read Also : వావ్‌! వాట్‌ ఏ క్యాచ్ సుయాష్‌..

ఇక శ్రీలంక మొదటి ఇన్నింగ్స్‌లో 280 పరుగులకు ఆలౌట్ అయ్యింది. అందుకు బదులుగా బంగ్లాదేశ్ 188 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయ్యింది. మొత్తానికి శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో మొత్తం 418 రన్‌లు చేసింది. మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యంతో కలిపి బంగ్లాదేశ్ ఎదుట 511 పరుగుల టార్గెట్ ఇచ్చింది. రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 182 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో శ్రీలంక 328 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. కమిందు మెండిస్ ఏడో స్థానంలో దిగి సెంచరీ చేసి రికార్డ్ సాధిస్తే, ఒకే టెస్టులో ఇద్దరు బ్యాటర్లు రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీల మోత మోగించి మూడో జోడీగా రికార్డ్ సాధించారు.

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు