Could Not Go To The Airport Because I Was Nervous About Facing People: భారత స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ సుదీర్ఘ విరామం తర్వాత క్రికెట్ గ్రౌండ్‌లోకి ఎంట్రీ ఇచ్చి ఐపీఎల్‌లో అదరగొట్టేశాడు. దీంతో టీ20 ప్రపంచ కప్ కోసం అనౌన్స్ చేసిన భారత జట్టులో స్థానం సంపాదించుకున్నాడు. ఇప్పటికే అమెరికా చేరుకున్న పంత్, తాను తీవ్రంగా గాయపడినప్పుడు ఎదుర్కొన్న చాలారకాల సమస్యలను గుర్తు చేసుకున్నాడు.
అన్నినెలల పాటు అనుభవించిన నరక వేదన గురించి వెల్లడించాడు. రోడ్డు ప్రమాదంలో నా జీవితాన్ని చాలా మార్చిందని, ఆ సమయం చాలా ఎక్స్‌పీరియన్స్ నేర్పింది. ఆ టైమ్‌లో తనకు తీవ్ర గాయాలయ్యాయని, దాని కారణంగా ప్రాణాలతో ఉంటానో లేదో అనిపించిందని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఏడు నెలల పాటు భరించలేని నొప్పిని అనుభవించా. అది నరకంగా అనిపించింది. దాదాపు రెండు నెలలు మౌత్ బ్రష్ చేసుకోలేకపోయాను. వీల్‌ఛైర్‌లో ఉండే వ్యక్తులను చూస్తే ఇబ్బందిగా అనిపించేది. భయంగా ఉండేది. అందుకే ఎయిర్‌పోర్టుకు వెళ్లలేకపోయా. కానీ భగవంతుడు రక్షించాడని రిషభ్ పంత్ గుర్తు చేసుకున్నాడు.
Also Read:టీ20 సీజన్, ఇక పూనకాలే..!
ఇటీవల ఓ షోలో పాల్గొన్న పంత్.. ఈ విషయాలను షేర్ చేసుకున్నాడు. ఇక రిషబ్ పంత్ 2022 డిసెంబర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఆ తర్వాత 15 నెలల పాటు క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. తిరిగి మైదానంలోకి ఎంట్రీ ఇచ్చేందుకు తీవ్రంగా శ్రమించాడు. ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టి పుంజుకున్నాడు. ఐపీఎల్‌లో అదరగొట్టి మరోసారి తన అభిమానుల ఆదరణ పొంది, టీ20 ప్రపంచ కప్ కోసం టీమిండియా జట్టులో ఛాన్స్ కొట్టేశాడు.