Chess round | చెస్ టోర్నీలో భారత గ్రాండ్‌ మాస్టర్‌ ఓటమి
Chess Round 4 Vaishali Extends Lead Pragnanandhaa Humpy Suffer Losses
స్పోర్ట్స్

Chess round: చెస్ టోర్నీలో గ్రాండ్‌ మాస్టర్‌ ఓటమి

Chess Round 4 Vaishali Extends Lead Pragnanandhaa Humpy Suffer Losses: నార్వే చెస్ టోర్నీలో భారత గ్రాండ్‌ మాస్టర్ ప్రజ్ఞానంద అందరికి షాకిచ్చాడు. ఎవరు ఊహించని స్థాయిలో రెండో ఓటమిని చవిచూశాడు. మూడో రౌండ్‌లో వరల్డ్ నం.1 కార్ల్‌సన్‌పై సంచలన విజయం సాధించిన ప్రజ్ఞానంద, ఆ తర్వాతి రౌండ్‌లో పరాజయం పొంది అందరిని డిసప్పాయింట్ చేశాడు. శుక్రవారం జరిగిన నాలుగో రౌండ్‌లో అమెరికా గ్రాండ్‌మాస్టర్‌ హికారు నకమురా చేతిలో ఓటమిని ఎదుర్కొన్నాడు.

నల్లపావులతో ఆడిన ప్రజ్ఞానంద అంత తేలిగ్గా గేమ్‌ను ప్రదర్శించలేకపోయాడు. ప్రత్యర్థికి గట్టి సవాల్ విసిరిన అతను 86 ఎత్తుల్లో కూడా ఓటమిని అంగీకరించాడు. ఈ పరాజయంతో అగ్రస్థానాన్ని కోల్పోయి అతను 5.5 పాయింట్లతో అమాంతం 4వ స్థానంలో నిలిచాడు.ఇక ఇదిలా ఉంటే మరోవైపు మహిళల విభాగంలో ప్రజ్ఞానంద సోదరి వైశాలి అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది.

Also Read: మురికివాడ నుండి క్రికెట్‌ వైపు పరుగులు

4వ రౌండ్‌లో ఆమె స్వీడన్ క్రీడాకారిణి పియా క్రామ్లింగ్‌పై విజయం సాధించింది. భారత అగ్రశ్రేణి క్రీడాకారిణి కోనేరు హంపి ఖాతాలో మరో ఓటమి చేరింది. 4వ రౌండ్‌లో అన్నా ముజిచుక్ (ఉక్రెయిన్) చేతిలో ఆమె పరాజయం పాలైంది. వైశాలి 8.5 పాయింట్లతో టాప్ పొజిషన్‌లో ఉండగా, కోనేరు హంపి మాత్రం 3 పాయింట్లతో చిట్టచివరి స్థానంలో నిలిచింది.

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..