BCCI Lady Staff Team India Digital Social Media Manager Rajal Arora
స్పోర్ట్స్

Team India: టీమిండియాలో మెరిసిన అమ్మాయి, ఫొటో వైరల్‌

BCCI Lady Staff Team India Digital Social Media Manager Rajal Arora: టీమిండియా క్రికెట్‌ టీమ్‌ అనగానే అందరూ మెన్స్‌ మాత్రమే ఉంటారు. అందులోనూ సపోర్టింగ్‌ స్టాఫ్‌లో కూడా అందరూ పురుషులే ఉంటారని అనుకుంటారు. ఎందుకంటే వారంతా తరచూ ఫారిన్‌ టూర్‌లు, డే అండ్ నైట్ అంటూ షెడ్యూల్స్‌ ఉంటాయి. కాబట్టి ఆ టీమ్‌లో మహిళలు ఉండరని అందరూ భావిస్తుంటారు. కానీ భారత జట్టు స్టాఫ్‌లోనూ ఓ మహిళ ఉందనే విషయం అందరూ మర్చిపోయారు.

అప్పుడప్పుడు టీమ్‌ షేర్‌ చేసిన ఫొటోస్‌లో ఎక్కడో ఓ చోట ఆమెను మీరు కూడా చూసే ఉంటారు. కచ్చితంగా ఆమె ఎవరు? అనే సందేహం మీక్కూడా వచ్చే ఉంటుంది. గతంలో దక్షిణాఫ్రికాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ జరిగినప్పుడు ఓ ఫొటోని నెట్టింట షేర్ చేశాడు. అందులో ప్లేయర్స్, భారత ఫీల్డింగ్ కోచ్, కోచింగ్ స్టాఫ్ కనిపించారు. వారి మధ్యలో ఓ అమ్మాయి నిల్చుని ఉంది. ఈ ఫొటోలో ఉన్న అమ్మాయి చాలా తక్కువ మందికే తెలిసి ఉంటుంది. దీంతో చాలా మంది ఆమె గురించి అప్పుడే ఆరా తీయడం, రాజల్ అలియాస్ రాజ్ లక్ష్మి అరోరా తన పేరు అని కనుక్కోవడం జరిగింది.

Also Read: ఒలింపిక్స్ బరిలో…

2024 జనవరిలో దక్షిణాఫ్రికా, కేప్‌టౌన్‌లో భారత్ టెస్ట్‌ జట్టు రికార్డు విజయం అందుకున్న తర్వాత దిగిన ఫొటోలో కూడా ఆమె కనిపిస్తుంది. బీసీసీఐ సోషల్ మీడియా మేనేజర్‌గా అరోరా పనిచేశారు. ఆ తరువాత సీనియర్ ప్రొడ్యూసర్‌గా, బీసీసీఐలో అంతర్గత ఫిర్యాదు కమిటీ హెడ్‌గా వ్యవహరిస్తున్నారు. ఆటగాళ్ల దుష్ప్రవర్తనపై వచ్చిన కంప్లైంట్స్‌ని పర్యవేక్షిస్తారు. పూణేలోని సింబయాసిస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మీడియా అండ్ కమ్యూనికేషన్స్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. కంటెంట్ రైటర్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసిన అరోరా, 2015లో సోషల్ మీడియా మేనేజర్‌గా బీసీసీఐలో చేరారు.

 

View this post on Instagram

 

Just In

01

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?