Ambati | ధోనీపై సంచలన వ్యాఖ్యలు చేసిన అంబటి
Dhoni Is A Player Who Wants To Play Another Season
స్పోర్ట్స్

Ambati: ధోనీపై సంచలన వ్యాఖ్యలు చేసిన అంబటి

Ambati Sensational Comments On MS Dhoni: సీఎస్‌కే మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీపై టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు సంచలన వ్యాఖ్యలు చేశాడు. ధోనీ చెన్నైకి దేవుడని, త్వరలో ధోనీ పేరిట దేవాలయాలు ఏర్పడతాయని అన్నాడు. 42 ఏళ్ల ధోనీ ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ప్రస్తుతం ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే ఆదివారం రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్ అనంతరం ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని వార్తలు నెట్టింట చక్కర్లు కొట్టాయి.

మ్యాచ్ అనంతరం ఫ్యాన్స్‌ స్టేడియంలోనే ఉండాలని సీఎస్‌కే ఫ్రాంచైజీ కోరడంతో ఈ ఊహాగానాలు స్టార్ట్ అయ్యాయి. కానీ ధోనీ రిటైర్మెంట్ గురించి ఎలాంటి అనౌన్స్‌మెంట్‌ చేయలేదు. మ్యాచ్‌ ముగిశాక సహచర ఆటగాళ్లతో కలిసి ధోని మైదానంలో తిరుగుతూ స్టాండ్స్‌లోని ఫ్యాన్స్‌కు అభివాదం చేశాడు. ధోనీ గాడ్ ఆఫ్ ది చెన్నై. రాబోయే కొన్నేళ్లలో చెన్నైలో ధోనీ దేవాలయాలు కచ్చితంగా నిర్మిస్తారని భావిస్తున్నా. రెండు వరల్డ్ కప్‌లు సాధించి భారత్‌కు ఆనందాన్ని అందించిన వ్యక్తి ధోనీ.

Also Read: కొంపముంచిన పాండ్యా

అంతేకాదు ఐపీఎల్ ట్రోఫీలు, ఛాంపియన్ లీగ్ టైటిళ్లు సాధించి చెన్నైకి సంతోషాన్ని అందించాడు. తన ఆటగాళ్లపై ఎంతో నమ్మకం ఉంచే సారథి అతడు. ఎల్లప్పుడూ దేశం, జట్టు, సీఎస్‌కే కోసం ఆడతాడని రాయుడు ధీమా వ్యక్తం చేశాడు. ఐపీఎల్‌లో ధోనీ సీఎస్‌కేతో పాటు రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్ తరఫున కూడా ప్రాతినిథ్యం వహించాడు. లీగ్‌లో 263 మ్యాచ్‌లు ఆడిన ధోనీ 5218 రన్స్‌ చేసి, 24 అర్ధశతకాలు సాధించాడు. 14 సీజన్లలో సీఎస్‌కే జట్టును నడిపించిన ధోనీ అయిదు సార్లు జట్టును విజేతగా నిలిపాడు. కాగా, ధోనీ ఈ సీజన్‌లో వికెట్ కీపర్‌‌గానే బరిలోకి దిగాడు.

Just In

01

Premante OTT Release: ప్రియదర్శి ‘ప్రేమంటే’ ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

VH Hanumantha Rao: బీసీ రిజర్వేషన్లపై.. బీజేపీ ఓబీసీ ఎంపీలు మౌనమేల: వీహెచ్ ఫైర్

Lipstick: మీ స్కిన్ టోన్‌కి అద్భుతంగా కనిపించే లిప్ స్టిక్ షేడ్స్.. డే-టు-డే నుండి పార్టీ లుక్ వరకు

New Year Party: న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్.. నగరానికి చేరుస్తున్న పెడ్లర్లు డెడ్​ డ్రాప్​ పద్దతిలో..!

Nagababu Politics: అక్కడ ఫోకస్ పెట్టేందుకు ప్రత్యక్ష రాజకీయాల్లో ఫోకస్ తగ్గించుకుంటున్న మెగా బ్రదర్..