102 Years Old Kashmir Man Plays Cricket Viral Video
స్పోర్ట్స్

Sports News: క్రికెట్ బ్యాట్‌తో దర్శనమిచ్చి తగ్గేదేలే అంటున్న తాతయ్య

102 Years Old Kashmir Man Plays Cricket Viral Video: సాధారణంగా 50 ఏళ్లు దాటాయంటే మనవాళ్లు ఏం చేస్తాం. కృష్ణా రామ అనుకుంటూ ఇంట్లో కూర్చుంటారు. కానీ ఇక్కడ కనిపిస్తున్న ఓ వందేళ్ల వృద్ధుడు అలా చేయలేదు. ఈ వ‌య‌సులోనూ తగ్గేదేలే అంటూ కుర్రకారుకి ధీటుగా క్రికెట్ ఆడుతూ అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు. ఆత్మ‌విశ్వాసం ఉంటే వ‌య‌సు దేనికి అడ్డురాదని నిరూపించాడు క‌శ్మీర్‌కు చెందిన ఓ తాత‌య్య.

కశ్మీర్‌ రియాసి ప్రాంతానికి చెందిన 102 ఏళ్ల హ‌జి క‌ర‌మ్ దిన్‌ తన వ‌య‌సును మ‌రిచి త‌న బ్యాటింగ్ స్కిల్స్‌ను ప్ర‌ద‌ర్శిస్తున్నారు. వయసు కేవలం శరీరానికే తప్ప, ఉరకలెత్తే తన మనసుకు కాదని నిరూపించాడు. పిల్లల నుంచి పెద్ధల దాకా స్పోర్ట్స్ ఆడితే బాడీ ఫిట్‌నెస్ అదే ఉంటుందున్న సందేశాన్ని ఆయ‌న ఇస్తున్నారు. అంతేకాకుండా స్థానికంగా ఉండే యువ క్రికెట‌ర్లకు ఆ తాత‌య్య ఇన్స్‌పిరేష‌న్‌గా నిలుస్తున్నాడు.

Also Read: మహీ కోసం డై హార్డ్‌ ఫ్యాన్‌ ఏం చేసాడంటే..! 

ఇటీవ‌ల జ‌రిగిన రెండో ద‌శ లోక్‌స‌భ ఎన్నిక‌ల్లోనూ వందేళ్ల క‌ర‌మ్ దిన్ త‌న ఓటు హ‌క్కును విజయవంతంగా వినియోగించుకున్నాడు. ఇక తన కాళ్ల‌కు సేప్టీ ప్యాడ్స్‌, చేతుల‌కు గ్లౌజులు తొడుక్కొని.. జేకే బ్యాట్‌తో షాట్ల కొడుతున్న ఆ తాత‌య్య హిట్టింగ్ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాను షేక్‌ చేస్తుంది. అంతేకాదు ఈ వీడియో చూసిన నెటిజన్లు అందరు తాతయ్య నిజంగా నువ్వు తోపువయ్యా అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు ఈ తాతయ్యని.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!