Friday, July 5, 2024

Exclusive

Hyderabad: భాగ్యనగరం భవిత మార్చే ఔటర్ రింగ్ రైలు

 

  • హైదరాబాద్ సిగలో మరో మణిహారం
  • ఆర్ఆర్ఆర్ కు ఆనుకుని ఔటర్ రింగ్ రైలు
  • దేశంలోనే తొలిసారి హైదరాబాద కు దక్కిన గౌరవం
  • మొదలైన లొకేషన్ గుర్తింపు పనుల సర్వే
  • గూడ్స్ రైళ్లకు ప్రాధాన్యం
  • హైదరాబాద్ ప్రధాన నగరాలతో అనుసంధానం
  •  ప్రాజెక్ట్ ప్రాధమిక అంచనా రూ.12 వేల కోట్లు
  • బైపాస్ కారిడార్ గా ఔటర్ రైలును ఉపయోగించవచ్చు

 

విశ్వనగరంగా చెప్పుకునే భాగ్యనగరం రూపురేఖలు మారనున్నాయి. ఇక్కడ మెరుగైన జీవనప్రమాణాలు ఉండటంతో దేశంలోని అన్ని ప్రాంతాలవాళ్లూ చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాల పేరిట ఇక్కడే స్థిరపడిపోతున్నారు. నగర జనాభా కూడా అంతకంతకూ పెరిగిపోతోంది. ఇక వాహనాల సంఖ్య చెప్పనక్కర్లేదు. పర్యాటకుల సంఖ్య కూడా పెరిగిపోతోంది. కొత్త జాగాల కోసం హైదరాబాద్ శివార్లను ఎంచుకుని అక్కడే స్థిర నివాసం ఏర్పాటుచేసుకుంటున్నారు నగర ప్రజలు. హైదరాబాద్ అంటే ఒకప్పుడు కోఠి, ఆబిడ్స్, నాంపల్లి, బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్, అమీర పేట అనుకునే రోజులు పోయాయి. ఇప్పుడు నానక రామ్ గూడ, కందుకూరు, మేడ్చెల్, పోచంపల్లి ఇలా అటు ఇటు అని కాక నగరం చుట్టుపక్కలా శరవేగంతో హైదరాబాద్ ముఖచిత్రం మారిపోతోంది. ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణంతో చుట్టుపక్కల ప్రాంతాలలో రియల్ ఎస్టేట్ ఊపందుకుంది. ఇప్పుడు భాగ్యనగరం సిగలో సరికొత్త ప్రాజెక్టు రానుంది. త్వరలోనే రీజనల్ రింగ్ రోడ్డుకు అనుసంధానంగా ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టు రానుంది. గతేడాది ఈ ప్రాజెక్టు ఫైనల్‌ లొకేషన్‌ సర్వే కోసం రైల్వే శాఖ రూ.13.95 కోట్లను మంజూరు చేసింది. ఇప్పుడు ఆ పనులు మొదలయ్యాయి.

మొదలైన నార్త్ రింగురోడ్డు అలైన్‌మెంటు
ఉత్తర భాగం రింగురోడ్డు అలైన్‌మెంటు ఇప్పటికే ఖరారైంది. కానీ, దక్షిణ రింగురోడ్డు అలైన్‌మెంటు ఖరారు కాలేదు. ఈ మేరకు ఎన్‌హెచ్‌ఏఐని కోరిన రైల్వే అధికారులు అటు నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ రాగానే ప్రాథమిక అలైన్‌మెంటు సిద్ధం చేసుకుని, వెంటనే ఏరియల్‌ లైడార్‌ సర్వే ప్రారంభిస్తారు. హెలికాప్టర్‌లో లైడార్‌ వ్యవస్థ ఏర్పాటు చేసుకుని.. 300 మీటర్ల వెడల్పుతో అలైన్‌మెంటు కోసం 3డీ మ్యాపింగ్‌ చేస్తారు. నీటి వనరులు, కాలువలు, గుట్టలు, నిర్మాణాలు.. ఇలాంటి వాటిని గుర్తించి తదనుగుణంగా మార్గాన్ని ఖరారు చేస్తారు.

గూడ్స్ రైళ్లకు ప్రాధాన్యత

రింగురోడ్డును ఆసరా చేసుకుని రింగ్‌ రైల్‌ ప్రాజెక్టు నిర్మించటం దేశంలోనే తొలిసారి. దీన్ని కూడా సరుకు రవాణా రైళ్లకు ఎక్కువగా ఉపయోగపడేలా చూస్తున్నారు. ప్రస్తుతం గూడ్సు రైళ్లు సికింద్రాబాద్‌ లాంటి రద్దీ స్టేషన్ల గుండా సాగాల్సి వస్తోంది. అయితే ఔటర్‌రింగ్‌ రైల్‌ కారిడార్‌ పలు రైల్వే మార్గాలతో అనుసంధానమై ఉండటంతో సరుకు రవాణా రైళ్లు నగరంలోకి ప్రవేశించాల్సిన అవసరం లేకుండానే గమ్యం వైపు పరుగుపెట్టే వీలు కలుగుతుంది. ఇది రైల్వే ట్రాఫిక్‌కు కూడా రిలీఫ్‌ క ల్పిస్తుంది.

ప్రాజెక్ట్ ప్రాధమిక అంచనా రూ.12 వేల కోట్లు

రీజినల్‌ రింగురోడ్డు దాదాపు 343 కి.మీ. నిడి వి ఉండనుండగా, దాని చుట్టూ విస్తరించే రైల్వే లైన్‌ మాత్రం దాదాపు 536 కి.మీ. నిడివితో ఉండనుంది. ఈ ప్రాజెక్టు ప్రాథమిక అంచనా వ్యయం రూ.12వేల కోట్లుగా అంచనా. వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు వచ్చే ప్రధాన రైల్వే లైన్లను అనుసంధానిస్తూ ఈ ప్రాజెక్టు కొనసాగుతుంది. రైల్వే ట్రాక్‌ మీదుగా రోడ్డును నిర్మించినట్టుగానే ఆయా ప్రాంతాల్లో రైల్‌ ఓవర్‌ రైల్‌ బ్రిడ్జిలను నిరి్మస్తారు. అక్కన్నపేట, యాదాద్రి, చిట్యాల, బూర్గుల, వికారాబాద్, గజ్వేల్‌ తదితర ప్రాంతాల్లో ఆ తరహా వంతెనలు నిర్మించే అవకాశం ఉందని ప్రాథమికంగా భావిస్తున్నారు.
ఈ రైలు మార్గంలో దాదాపు 50 వరకు రైల్వే స్టేషన్లు ఉండే అవకాశం ఉందని ప్రాథమికంగా తేల్చారు. 75 మీటర్ల వెడల్పుతో ఈ మార్గం సిద్ధమవుతుంది. స్టేషన్‌ ఉండే చోట రెండు కి.మీ. పొడవుతో 200 మీటర్ల వెడల్పుతో భూమిని సేకరిస్తారు. ఈ ప్రాజెక్టులో ప్రతి కి.మీ.కు రూ.20 కోట్ల వరకు ఖర్చవుతుంది. భూసేకరణలో సగం మొత్తాన్ని కేంద్రం భరించనుంది.

అతి త్వరలోనే పట్టాలెక్కనున్న ప్రాజెక్ట్

ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్టు ఏయే ప్రాంతాల మీదుగా వెళ్లనుందో రైల్వే శాఖ అధికారులు సూచనప్రాయంగా వెల్లడించారు. అక్కన్నపేట్, భువనగిరి, యాదగిరిగుట్ట, చిట్యాల, బూర్గుల, వికారాబాద్, గేట్ వనంపల్లి, మెదక్, సిద్దిపేట, గజ్వేల్ ప్రాంతాల మీదుగా వెళ్లనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రాజెక్టు వికారాబాద్, మెదక్, సిద్దిపేట, కామారెడ్డి, యాదాద్రి భువనగిరి, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలను కలుపుతూ వెళ్లనుంది. వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, అక్కన్నపేట్, సిద్దిపేట్, గజ్వేల్, భువనగిరి, యాదగిరిగుట్ట, రామన్నపేట, చిట్యాల, నారాయణపూర్, షాద్‌నగర్, షాబాద్ వంటి పట్టణాలను సైతం కలుపుతూ వెళుతుందని రైల్వే శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఎఫ్​ఎల్​ఎస్​కు రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదం తెలపడంతో వీలైనంత త్వరగా సర్వే చేపట్టనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే.. హైదరాబాద్-సికింద్రాబాద్-కాచిగూడ రీజియన్‌లో మరింత వేగంగా సరకు రవాణా చేసేందుకు అవకాశం ఉంటుందని రైల్వే శాఖ భావిస్తోంది. ఔటర్ రింగ్ రైల్‌ను బైపాస్ కారిడార్‌గా వినియోగించుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. రీజినల్ రింగ్ రోడ్డు, రింగ్​ రైల్​తో హైదరాబాద్​ రూపురేఖలు మారిపోనున్నాయని పేర్కొంటున్నారు.

Publisher : Swetcha Daily

Latest

Pawan Kalyan: మనం OG అంటే.. ప్రజలు ‘క్యాజీ’ అంటారు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు రావడం వెనుక కీలక పాత్ర...

CM Revanth Reddy: రాజకీయాలకు అతీతం… అభివృద్దే మా లక్ష్యం

- బిజీబిజీగా సీఎం హస్తిన పర్యటన - ప్రధానిని కలిసిన సీఎం రేవంత్,...

CM Revanth Reddy: కేసీఆర్‌పై ప్రేమ తగ్గలేదా?

- కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఈటల ఏం చేశారు? - ఆయనపై ఇంకా...

Amrapali Kata: ఆమ్రపాలి ఆకస్మిక తనిఖీలు

GHMC: మంత్రులు, ఉన్నతాధికారులు, వివిధ శాఖల బాధ్యులు పనిపై శ్రద్ధ పెంచాలని,...

Telangana BJP: ఇద్దరు సీఎంలు కలవాలనే కోరుకుంటున్నాం.. కానీ!?

NVSS Prabhakar: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్...

Don't miss

Pawan Kalyan: మనం OG అంటే.. ప్రజలు ‘క్యాజీ’ అంటారు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు రావడం వెనుక కీలక పాత్ర...

CM Revanth Reddy: రాజకీయాలకు అతీతం… అభివృద్దే మా లక్ష్యం

- బిజీబిజీగా సీఎం హస్తిన పర్యటన - ప్రధానిని కలిసిన సీఎం రేవంత్,...

CM Revanth Reddy: కేసీఆర్‌పై ప్రేమ తగ్గలేదా?

- కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఈటల ఏం చేశారు? - ఆయనపై ఇంకా...

Amrapali Kata: ఆమ్రపాలి ఆకస్మిక తనిఖీలు

GHMC: మంత్రులు, ఉన్నతాధికారులు, వివిధ శాఖల బాధ్యులు పనిపై శ్రద్ధ పెంచాలని,...

Telangana BJP: ఇద్దరు సీఎంలు కలవాలనే కోరుకుంటున్నాం.. కానీ!?

NVSS Prabhakar: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్...

National ‘సత్సంగ్’పై అన్నీ సందేహాలే !!

హథ్రస్ లో జరిగిన సత్సంగ్ కార్యక్రమంలో పెరుగుతున్న మృతుల సంఖ్య వందల సంఖ్యలో గుర్తుతెలియని మృతదేహాలు ‘సత్సంగ్’ అనుమతులపై అనేక అనుమానాలు లక్షల సంఖ్యలో భక్తులు కలిగిన భోలేబాబా ఇంటిలిజెన్స్ బ్యూరో...

National: మూడోసారి ప్రధాని కావడం జీర్ణించుకోలేకపోతున్నారు

ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని మోదీ రాహుల్ లా ప్రవర్తించకండంటూ ఎంపీలకు సూచన అధికార, మిత్ర పక్షాల నేతలకు దిశానిర్దేశం మీడియా కామెంట్స్ కు ముందు ఆ సమస్యపై స్టడీ...

National news:మహారాష్ట్రలో ‘జికా’ కలకలం

2 Pregnant Women Test Positive For Zika Virus In Pune Total Rises To 6 భారత్ లో జికా వైరస్ విజృంభిస్తోంది. మహారాష్ట్రలోని పూణెలో ఆరు జికా వైరస్‌ కేసులు...