- హథ్రస్ లో జరిగిన సత్సంగ్ కార్యక్రమంలో పెరుగుతున్న మృతుల సంఖ్య
- వందల సంఖ్యలో గుర్తుతెలియని మృతదేహాలు
- ‘సత్సంగ్’ అనుమతులపై అనేక అనుమానాలు
- లక్షల సంఖ్యలో భక్తులు కలిగిన భోలేబాబా
- ఇంటిలిజెన్స్ బ్యూరో ఉద్యోగానికి రాజీనామా చేసి
- భోలేబాబాగా అవతరించిన నారాయణ్ శకర్ హరి
- భోలే బాబాకు యూపీ సీఎం అండ పై అనుమానాలు
- గతంలోనూ ఇలాంటి దుర్ఘటనే జరిగినా అనుమతి ఎలా ఇచ్చారు?
- భోలేబాబా స్వయంగా తీర్థం ఇవ్వడంతో ఒక్కసారిగా ఎగబడిన జనాలు
- కోవిడ్ సమయంలోనూ 50 మంది అనుమతితో 50 వేలమందితో నిర్వహణ
- భోలేబాబాపై నమోదవుతున్న నామమాత్రపు కేసులు
UP Hathras Stampede 116 bodies identified government forms probe panel
ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఓ ఆధ్యాత్మిక కార్యక్రమం అనేక కుటుంబాలలో పెను విషాదం నింపింది. హథ్రస్ జిల్లాలో జరిగిన సత్సంత్ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగింది. రతిభాన్ పుర్ లో శివారాధన కార్యకమం సమయంలో ఒక్ససారిగా జరిగిన తొక్కిసలాటలో దాదాపు 116 మంది మృతి చెందినట్లు కథనాలు వస్తున్నాయి. అసలు లెక్కతీస్తే అనేక విషయాలు వెలుగులోకి వస్తాయంటున్నారు. ఇంకా గుర్తుతెలియని మృతదేహాల సంఖ్య ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందగానే అధికారులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై స్పందించిన జిల్లా మేజిస్ట్రేట్ ఆశిష్ కుమార్, సత్సంగ్ అయిపోయిన తర్వాత, బయటకు వెళ్లే క్రమంలో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. దీనిపై జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించిన చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు.
ఇంటిలిజెన్స్ బ్యూరో ఉద్యోగానికి రాజీనామా
ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం భోలే బాబా ఆధ్వర్యంలో జరిగింది. ఇంతకీ ఎవరీ భోలే బాబా? ఆయన వ్యక్తిగత జీవితం ఏమిటి? మొదటినుంచి అసలు ఆయన బాబాయేనా? కాషాయ వస్త్రాలు ధరించకుండా కేవలం తెల్లటి వస్త్రాలు మాత్రమే ధరించే ఈ బాబా అసలు పేరు నారాయణ్ శకర్ హరి. యూపీలోని ఎటా జిల్లాలోని బహదూర్ నగరి గ్రామం. హరి భార్య మానవ్ మంగళ్ మిలాన్ సద్భావన సమగం పేరిట ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. గతంలో తాను ఉత్తరప్రదేశ్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో పని చేసినట్లు చెప్పుకున్నారు. భోలే బాబాగా ప్రసిద్ధి గాంచిన ఈ హరి.. కాషాయం దుస్తులు ధరించడు. కేవలం తెలుపు రంగులో ఉండే దుస్తులు మాత్రమే ధరిస్తాడు. సంపాదించిన డబ్బునంతా తన భక్తుల కోసమే ఖర్చు పెడుతున్నట్లు చెప్పాడు. ఇక ఇంటెలిజెన్స్ ఏజెన్సీలో పని చేసినప్పుడు కూడా తాను ఆధ్యాత్మికంలో మునిగి తేలేవాడినని తన భక్తులకు వివరిస్తుంటాడు. తనలో నింపుకున్న ఆధ్యాత్మికతను అందరికీ పంచాలనే ఉద్దేశంతో 1990లో ఇంటిలిజెన్స్ బ్యూరో ఉద్యోగానికి రాజీనామా చేశారు. అప్పటినుంచి పూర్తిగా ఆధ్యాత్మిక జీవితానికి అలవాటు పడ్డారు.
గతంలోనూ ఇదే తరహా
గతంలోనూ ఈ భోలే బాబా పలు ఈవెంట్లు నిర్వహించి కటకటాలపాలయ్యాడు. 2022 మే నెలలో కోవిడ్ పీక్ స్టేజీలో ఉన్నప్పుడు కూడా ఇదే మాదిరిగా ఓ ఆరాధన కార్యక్రమం నిర్వహించాడు. కరోనా నిబంధనలు కూడా ఉల్లంఘించాడనే కారణంగా భోలేబాబాపై కేసులు నమోదు అయ్యాయి. పోలీసులు కేవలం 50 మందికే అనుమతి ఇస్తే ఆయన 50 వేల మందికి అనుమతించాడు. ఇక ఈ భోలే బాబు తన సొంత కార్యక్రమాలకు సంబంధించిన ఈవెంట్లు , తన ప్రసంగాలను ప్రచారం చేసుకోవడానికి సొంతంగా ఓ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. ఈ ఛానల్ కు దాదాపు 30 వేల మందికి పైగా ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. . ఈయనకు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా, ఢిల్లీలో భక్తులు ఉన్నారు. భోలే బాబా ఆశీర్వాదం కోసం ఈ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివస్తుంటారు.జులై 2వ తేదీన చోటు చేసుకున్న తాజా ఘటనతో భోలే బాబాపై మరోసారి ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ ఘటనపై ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేసి విచారణ చేపట్టాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు.
తానే దేవుడునని ..
2006లో వీఆర్ఎస్ తీసుకుని భోలేబాబాగా అవతారం ఎత్తిన ఈయన . తనకు ఎవరూ గురువులు లేరని, భగవంతుడే తనకు జ్ఞానాన్ని అనుగ్రహించాడని చెప్పుకుంటాడు భోలే బాబా. మొదట్లో తన సొంత గ్రామంలోనే ఒక గుడిసెలో ఉంటూ ఆధ్యాత్మిక ఉపదేశాలు చేసిన భోలేబాబా.. ఇతర ప్రాంతాల్లో కూడా తన ఆశ్రమాలను ఏర్పాటు చేశాడు. ఇతడికి ఉత్తరప్రదేశ్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా లక్షల సంఖ్యలో భక్తులు ఉన్నారు. తన భక్తులకు బోధనలు ఇచ్చేందుకు ప్రతి ఏటా సత్సంగ్ పేరుతో భారీ ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహిస్తాడు భోలే బాబా. ఈ సత్సంగ్‌లో తన భార్యతో పాటు ఆసనంలో కూర్చుని బోధనలు అందిస్తాడు భోలే బాబా. కార్యక్రమం చివర్లో బాబా అనుచరులు భక్తులకు జలాన్ని పంపిణీ చేస్తారు. ఈ పవిత్ర జలం తీసుకుంటే రోగాలు దూరమవుతాయని భక్తుల విశ్వాసం. అందుకే ఈ సంత్సంగ్‌కు లక్షల సంఖ్యలో జనం తరలి వస్తుంటారు. కరోనా సమయంలో కూడా నిబంధనలు పాటించకుండా.. 50వేల మందితో ఈ కార్యక్రమం నిర్వహించాడు భోలే బాబా.
ఊరూరా పోస్టర్లు..
ప్రస్తుతం ఎలాంటి ఆంక్షలు లేకపోవడంతో గత రెండేళ్లుగా భారీగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు..బాబా అనుచరులు. ఈ ఏడాది రతిభాన్పూర్‌లో నిర్వహించిన కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రచారం కూడా నిర్వహించారు. ఊరూరా పోస్టర్లు అంటించారు. అయితే ఇంతపెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తున్నా కూడా.. పోలీసుల నుండి గానీ, అధికార యంత్రాంగం నుండి గానీ ఎలాంటి అనుమతులు తీసుకోలేదు నిర్వాహకులు. అటు అధికారం యంత్రాంగం కూడా ఈ బాబా వ్యవహారంలో చూసి చూడనట్టు వ్యవహరించింది. భక్తుల తాకిడితో స్థానికంగా ఉన్న ట్రాఫిక్ వ్యవస్థ కుప్పకూలింది. అటు నిర్వాహకులు కూడా లక్షల సంఖ్యలో వచ్చిన భక్తులను కంట్రోల్ చేయలేక చేతులెత్తేశారు. దీంతో పెనువిషాదం చోటుచేసుకుంది. అయితే ఈ భోలేబాబా వెనుక ఉన్న బలమైన రాజకీయ శక్తులు ఎవరైనా ఉన్నాయా? యూపీ అధికార యంత్రాంగా నుంచి వీరికి ఎలాంటి సాయం అందుతోంది. దీనిపై యోగి ఆధిత్యనాధ్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో అనేది ఉత్కంఠగా మారింది.