YS Jagan: అవును.. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) వీరాభిమానులు, వైసీపీ (YSRCP) కార్యకర్తలు కచ్చితంగా ఓవరాక్షన్ తగ్గించుకోవాల్సిందే..! ఇది ఎవరు ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయినా జగమెరిగిన నిజం. ఎందుకంటే కొందరు ఫ్యాన్స్ చేస్తున్న పనికి అడ్డంగా అధినేత బుక్కవుతున్న పరిస్థితి. అది కూడా ఎక్కడిదాకా వెళ్తోందంటే పీకలదాకా వచ్చేస్తున్నాయ్. అయితే.. ఇవన్నీ తెలిసి చేస్తున్నారో, తెలియక చేస్తున్నారో కానీ ఇకనైనా కొన్ని కొన్ని మార్పులు, చేర్పులు చేసుకుంటే మంచిదని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు. ఈ మధ్య జరిగిన కొన్ని సంఘటనలు చూసుకుంటే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. కాస్త లోతుగా వెళ్లి చర్చించుకుందాం రండి.. అంతేకాదు ఈ విషయంలో సొంత పార్టీ కార్యకర్తలు, నేతలు ఏమనుకుంటున్నారో కూడా ఓ లుక్కేద్దాం రండి..
Read Also- YS Jagan: ఇందిరమ్మతో వైఎస్ జగన్‌కు పోలికేంటి.. ఆశకు హద్దులేదా?
Read Also- Marriage: ఏంటిది భయ్యా.. మగాళ్లను బతకనివ్వరా?
ఎందుకిలా..?
పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటనలో వైఎస్ జగన్ కారు బానెట్ పైకి కొందరు అభిమానులు, కార్యకర్తలు ఎక్కడం, దాని మీదే డ్యాన్సులు వేయడం ఎంతవరకు సబబు? దాన్ని అధినేత వ్యక్తిగత సిబ్బంది అస్సలు కంట్రోల్ చేయలేకపోతోంది. దీనికి తోడు జగన్‌తో కరచాలనం చేయాలన్న ప్రయాసలో విపరీతమైన తోపులాట అనుకోకుండానే జరిగిపోతోంది. ఇప్పుడు సింగయ్య ఘటనే చూస్తే.. ఆయన ఆ కారు కింద పడ్డాడా? లేదా? అది ఏఐ వీడియోనా? (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI) అనేది పక్కనబెడితే.. కొందరు జగన్ కాన్వాయ్ ముందు చేస్తున్న అతి చాలా ఎక్కువగా ఉన్నది. అది ఎంతలా అంటే ఇటు జగన్‌కు ఇటు అభిమానులకు ప్రమాదానికి దారితీసేలా ఉండటం గమనార్హం. ఎందుకంటే ఒకటికి రెండుసార్లు అభిమానులు, కార్యకర్తలు చేసే ఈ పనులు ఎంతవరకూ ప్రమాదం అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇకపైన ఈ విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్త పడాల్సి ఉంది. దీనికితోడు ప్లకార్డులు, స్లోగన్స్ సైతం హార్ష్‌గా కాకుండా జాగ్రత్త తీసుకోవాలి.
16 ఏళ్లు గడిచినా..!
వాస్తవానికి వైఎస్ జగన్ రాజకీయాల్లోకి వచ్చి ఇంచుమించు 16 ఏళ్లు అవుతోంది. ఇంకా ఆయనతో ఫొటో దిగాలని, తాకాలని, కరచాలనం చేయాలని పోటీపడి మరీ ఎగబడటం, తోసుకుంటున్నారు. ఇదంతా జగన్ మీద కొందరు అభిమానం చూపించే క్రమంలో చేస్తున్నారని అనుకోవచ్చు కానీ.. ఈ చర్యలతో అభిమానించే అధినేతతో పాటు తోటి కార్యకర్తలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనే విషయాన్ని తెలుసుకోవాలి. ముఖ్యంగా డైహార్డ్ ఫ్యాన్స్ అంతా జగన్ కాన్వాయ్ వద్ద ఉత్సాహం చూపించడం కన్నా.. జగన్ సందేశాన్ని, ప్రభుత్వ తప్పులను క్షేత్ర స్థాయిలోకి తీసుకెళ్లడానికి ప్రాధాన్యత ఇస్తే అదే పదివేలు అని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు. జగన్ అభిమానులు హీరో వర్షిప్ నుంచి ఇకనైనా బయటకొచ్చి.. పార్టీకి క్షేత్ర స్థాయిలో పనిచేస్తే 40 ఏళ్ల టీడీపీ కార్యకర్తల వ్యవస్థను మించి వైసీపీ కార్యకర్తల వ్యవస్థ పెరుగుతుందని.. ఇందులో ఎలాంటి సందేహాలు అక్కర్లేదని.. ఇదే జరిగితే రానున్న ఎన్నికల్లో అధినేత జగన్‌ను సీఎం చేసుకోవచ్చని కొందరు అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు చెప్పండి.. ఇప్పటికైనా మార్పు రావాలా.. లేదా అన్నది!
Read Also- YS Jagan: వైఎస్ జగన్‌పై కుట్ర జరుగుతోందా?