shabbir ali
Politics

Crop Loss: రైతులు దిగులు పడొద్దు.. ఎన్నికల తర్వాత పంటనష్ట పరిహారం

Shabbir Ali: అకాల వర్షాలతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. పంట చేతికి వస్తున్న తరుణంలో వర్షాలు కురవడంతో ఆరుగాలం శ్రమించినదంతా వృధా అయిపోతున్నది. మరోవైపు ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో తక్షణమే ప్రభుత్వం నుంచి సాయం అందేలా లేదు. ఈ తరుణంలోనే రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, మాజీ మంత్రి షబ్బీర్ అలీ రైతులకు భరోసా ఇచ్చారు.

కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం సోమార్‌పేట గ్రామంలో అకాల వర్షం కారణంగా దెబ్బతిన్న వ్యవసాయ క్షేత్రాలను షబ్బీర్ అలీ పరిశీలించారు. పంట నష్టపోయిందని రైతులు, కౌలు రైతులు దిగులుపడవద్దని, మనస్తాపానికి గురికావొద్దని ధైర్యం చెప్పారు. పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. అకాల వర్షం కారణంగా నష్టపోయిన రైతులకు పరిహారం అందించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వివరించారు.

Also Read: రాధాకిషన్ రావుకు మధ్యంతర బెయిల్.. కారణం ఏమిటీ?

సీఎం రేవంత్ రెడ్డి పంట నష్టంపై సర్వే చేయించారని, వివరాలు సేకరించారని షబ్బీర్ అలీ ఈ సందర్భంగా తెలిపారు. అయితే, ఎన్నికల కోడ్ ముగిశాక బాధితులకు పంట నష్టానికి పరిహారం అందిస్తారని వివరించారు. అంతేకాదు, తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించినట్టు చెప్పారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై షబ్బీర్ అలీ ఇటీవలే మండిపడ్డారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలే తమతో టచ్‌లో ఉన్నారని, లోక్ సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కనిపించకుండా పోతుందని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు ఎన్నడూ నష్టపరిహారం అందించలేదని మండిపడ్డారు.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!