MLA Kadiyam Srihari: కేసీఆర్ ఉన్నంత వరకే బీఆర్ఎస్..!
MLA Kadiyam Srihari (imaghecredt:twitter)
Political News, Telangana News

MLA Kadiyam Srihari: కేసీఆర్ లేకపోతే.. నీ ఐడెంటిటీ ఎక్కడిది.. కేటీఆర్‌పై కడియం ఫైర్

MLA Kadiyam Srihari: ఫిరాయింపు ఎమ్మెల్యేలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR), వరంగల్(Warangal) పర్యటనలో కడియం శ్రీహరిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో గురువారం ఆయన స్పందించారు. కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. తాను దమ్మున్న నాయకుడినని, అయ్య అండ చూసుకొని రాజకీయాలు చేయడం లేదని సెటైర్లు వేశారు.

నీ ఐడెంటిటి ఎక్కడిది?

కేసీఆర్(KCR) లేకపోతే నిన్ను అడిగేవారెవరు. కేసీఆర్ లేకపోతే నీ ఐడెంటిటి ఎక్కడిది? నాకు కుటుంబ రాజకీయాలు లేవు. స్వతహాగా ఎదిగొచ్చా. విలువల గురించి, నీతి గురించి నువ్వు మాట్లాడుతున్నావా. గత పదేళ్లలో ఎమ్మెల్యేలను చేర్చుకొని మంత్రి పదవులు ఇచ్చిన నువ్వా విలువల గురించి మాట్లాడేది. ఆ రోజు ఏం పీకుతున్నావ్. కేసీఆర్‌కు తప్పు అని ఎందుకు చెప్పలేదు. ఇప్పుడు మాట్లాడే నైతిక హక్కు నీకు లేదు. నీ నాయకత్వం పైన సందేహాలున్నాయి. నీ దగ్గర పని చేయలేకనే కవిత బయటకు వచ్చారు. నీపై నమ్మకం లేక హరీశ్ రావు బాధపడుతున్నారు అంటూ కేటీఆర్‌పై మండిపడ్డారు.

Also Read: S Thaman: థమన్‌పై ఈ ట్రోలింగ్ ఏంటి? ‘అఖండ 2 – రాజా సాబ్’ మధ్య ఈ పోలికలేంటి?

కేసీఆర్ కోసమే హరీశ్ రావు

అంతేకాదు, కేటీఆర్(KTR) అంటేనే ఐరన్ లెగ్ అని, ఎమ్మెల్యేలు అందరూ ఆయన నాయకత్వంలో పని చేయలేకపోతున్నారని వ్యాఖ్యానిచారు. కేసీఆర్ కోసమే హరీశ్ రావు(Harish Rao) బీఆర్ఎస్(BRS)‌లో ఉన్నారని, సమయం చూసి ఆయన దారి ఆయన చూసుకుంటారని జోస్యం చెప్పారు. కేటీఆర్(KTR) నాయకత్వం పనికి రాదని బీఆర్ఎస్ శ్రేణులకు బాగా తెలుసని, ఇప్పటికైనా అహంకారం తగ్గించుకుంటే మంచిదని కడియం శ్రీహరి హితవు పలికారు.

Also Read: Magic of Chikiri Chikiri: ‘తలా జారుతుంది చూస్కో’.. బుచ్చిబాబుపై రామ్ చరణ్ కామెడీ.. మేకింగ్ వీడియో వైరల్

Just In

01

MA Yusuff Ali: దుబాయ్‌లో పబ్లిక్ బస్సెక్కిన ఇండియన్ బిలియనీర్.. వైరల్‌గా మారిన వీడియో ఇదిగో!

VC Sajjanar: న్యూ ఇయర్ ఈవెంట్​ జరుపుతున్నారా?.. అయితే అనుమతి తప్పనిసరి!

Artificial Intelligence: ఏఐ రంగంలో భారత్ సరికొత్త రికార్డు.. గ్లోబల్ ర్యాంకింగ్‌లో మూడో స్థానం

Congress Election Strategy: రెండో విడత కాంగ్రెస్ కొత్త స్ట్రాటజీ.. మెజార్టీ స్థానాలపై ఫోకస్..!

Telangana BJP: మున్సిపాలిటీలు విలీనంపై బీజేపీ పోరుబాట.. ఎస్ఐఆర్ పై కీలక నిర్ణయం