Politics on Phone Tapping: హరీశ్ రావు భలే బుక్ అయ్యారే!
Phone Tapping Case
Political News

Politics on Phone Tapping: చేసిందంతా చేసి.. సుద్ధపూస అంటే ఎట్లా.. హరీశ్ రావు భలే బుక్ అయ్యారే!

Politics on Phone Tapping: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి.. బీఆర్ఎస్ ముఖ్యనేత, మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao)ను మంగళవారం ఏడున్నర గంటలపాటు సిట్ (SIT) సుదీర్ఘంగా విచారించిన సంగతి తెలిసిందే. అయితే విచారణకు ముందు, తర్వాత నిర్వహించిన ప్రెస్ మీట్స్ లో హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) బావమరిది కుంభకోణం బయటపెట్టినందుకే తనపై కక్ష గట్టారని ఆరోపించారు. ప్రస్తుతం సిట్ విచారణ పేరుతో ప్రస్తుతం రాష్ట్రంలో అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నట్లు మండిపడ్డారు. అసలు ఫోన్ ట్యాపింగ్ అన్నదే జరగలేదన్న రీతిలో కాంగ్రెస్ సర్కార్ పై విరుచుకుపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి బీఆర్ఎస్ నేతలే అంగీకరించిన వీడియోలను నెట్టింట పోస్ట్ చేస్తున్నారు.

‘హరీశ్ రావే ఒప్పుకున్నారు’

బీఆర్ఎస్ నేత వీరమల్ల ప్రకాశ్ రావు (Prakash Rao).. ఫోన్ ట్యాపింగ్ అంశంపై గతంలో మాట్లాడిన వీడియోను కాంగ్రెస్ శ్రేణులు నెట్టింట వైరల్ చేస్తున్నారు. ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వి. ప్రకాశ్ మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందన్న విషయాన్ని హరీశ్ రావే స్వయంగా చెప్పినట్లు తెలిపారు. కేసీఆర్ హయాంలో హరీశ్ రావుకు ఎవరైనా ఫోన్ చేస్తే.. దయచేసి ఫోన్ చేయవద్దని ఆయన సూచించినట్లు పేర్కొన్నారు. తన ఫోన్ ట్యాపింగ్ అవుతోందని.. తనకు ఫోన్ చేస్తే మీ బతుకు కూడా ఆగమవుతుందని హరీశ్ రావు పలువురు నేతలకు హెచ్చరించినట్లు వి. ప్రకాశ్ చెప్పుకొచ్చారు. ఫలితంగా హరీశ్ రావు ఇంటి వద్దకు ఏ నేత కూడా వెళ్లలేదని.. ఎవర్నికూడా ఆయన రానిచ్చేవారు కాదని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇదే వీడియోను అడ్డుపెట్టుకొని.. హరీశ్ రావే స్వయంగా ఫోన్ ట్యాపింగ్ అంశం గురించి ఒప్పుకున్నట్లు కాంగ్రెస్ శ్రేణులు పేర్కొంటున్నాయి.

‘కవిత మాటలకు ఆన్సర్ చెప్పండి’

ఫోన్ ట్యాపింగ్ కట్టుకథ అంటూ కొట్టిపారేస్తున్న హరీశ్ రావుకు కవిత చేసిన వ్యాఖ్యల ద్వారా కాంగ్రెస్ శ్రేణులు గట్టి కౌంటర్ ఇస్తున్నారు. తన తండ్రి ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కవిత స్పష్టం చేయడం ఈ వీడియోలో గమనించవచ్చు. అంతే కాకుండా హరీశ్ రావే తన ఫోన్ ట్యాపింగ్ చేయించినట్లు కూడా కవిత ఆరోపించారు. తన మీద కక్ష సాధించడానికి, తనను ఎదగకుండా చేయడానికి తన భర్త ఫోన్ తో పాటు వ్యగ్తిగత సిబ్బంది మెుబైల్స్ ను కూడా ట్యాపింగ్ చేశారని ఆ ఇంటర్వ్యూలో కవిత ఆరోపించారు. ఇప్పుడు ఇదే వీడియోను బయటపెట్టి.. కవిత మాటలకు ఏం సమాధానం చెబుతారంటూ కాంగ్రెస్ శ్రేణులు హరీశ్ రావును ప్రశ్నిస్తున్నారు.

Also Read: Phone Tapping Case: ఆ కీలక నేత ఎవరో నాకు తెలియదన్న హరీష్ రావు.. త్వరలో మరికొందరికి నోటీసులు

కేటీఆర్ ఎలివేషన్స్ పైనా కౌంటర్

మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ ఎదుర్కొన్న హరీశ్ రావుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎలివేషన్స్ ఇవ్వడాన్ని కూడా కాంగ్రెస్ సోషల్ మీడియా వింగ్ తీవ్రంగా తప్పుబడుతున్నారు. మెుత్తం కేబినేట్ నే అసెంబ్లీలో హరీశ్ రావు ఫుట్ బాల్ ఆడుకున్నారన్న మాటలకు గట్టి కౌంటర్ ఇస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డిని ఎదుర్కొలేక కేసీఆర్ అస్త్ర సన్యాసం చేసి.. హరీశ్ రావును ముందుపెట్టారని కాంగ్రెస్ శ్రేణులు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు హరీశ్ రావు సైతం మెున్న జరిగిన అసెంబ్లీ సమావేశాలను ఎదుర్కొలేక వాకౌట్ చేసి బయటకొచ్చేశారని చెబుతున్నారు. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఎదురుగా నిలబడి మాట్లాడే దమ్ము, ధైర్యం హరీశ్ రావు సహా బీఆర్ఎస్ నేతలకు లేవని ఆరోపిస్తున్నారు.

Also Read: Traffic Challans: ట్రాఫిక్ పోలీసులపై హైకోర్టు సీరియస్.. చలాన్లు కట్టాలని బలవంతం చేయవద్దు..!

Just In

01

Vanga Geetha: పవన్‌పై పోటీ చేసిన వంగా గీత బిగ్ ట్విస్ట్?.. జోరుగా సాగుతున్న ప్రచారం ఇదే!

Viral Video: అగ్గిపెట్టెంత ఇల్లు.. రూ.1.2 కోట్లు అంట.. కొనేవాళ్లు మరీ అంత పిచ్చోళ్లా!

AR Rahman: ఏఆర్ రెహమాన్‌పై చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చిన ఆర్జీవీ.. ఏం జరిగిందంటే?

Davos Summit 2026: దావోస్‌లో సీఎం దూకుడు.. రేవంత్ విజన్‌కు టాప్ కంపెనీలు ఇంప్రెస్.. మరో భారీ డీల్ సెట్!

Medchal News: అంబేద్కర్ భవన భూమి కబ్జాకు యత్నం కలకలం.. భూమిని కాపాడాలంటూ డిమాండ్..!